Friday, November 22, 2024
Homeట్రేడింగ్Omega hospitals: ఒమేగా హాస్పిటల్స్ లో బయోనిక్ గోల్డ్ ఇంప్లాంట్ తో పార్షియల్ మోకాలి...

Omega hospitals: ఒమేగా హాస్పిటల్స్ లో బయోనిక్ గోల్డ్ ఇంప్లాంట్ తో పార్షియల్ మోకాలి రీసర్ఫేసింగ్

మరింత ఈజీగా మోకాలి మార్పిడి..

మోకాలి మార్పిడి అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ , విజయవంతమైన శస్త్రచికిత్సలలో ఒకటి, ఆర్థరైటిస్ తో బాధ పడుతున్న మధ్య వయస్కుల నుండి వృద్దుల వరకు ఇది ఒక వరం లాంటిది.

- Advertisement -

అలర్జీ రాకుండా..

మోకాలి కీలు మూడు కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది, మధ్యస్థ (లోపలి) కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్తో ఎక్కువగా ప్రభావితమవుతుంది , పూర్తి మోకాలి మార్పిడి అత్యంత సులభమైనాదే అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఎముక ఎక్కువ కోతకు గురవ్వడం , లిగమెంట్లు సైతం దెబ్బతినే అవకాశం ఉంది. గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య కపూర్ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా బయోనిక్ గోల్డ్ ఇంప్లాంట్ను ఉపయోగించి మోకాలి పాక్షిక రీసర్ఫేసింగ్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఇంప్లాంట్ టైటానియం, నియోబియం & నైట్రైడ్ తో పాటు యాంటీఆక్సిడెంట్ పాలిథిలిన్ కలిగి ఉంటుంది దీని ద్వారా శరీరం లోహ అలెర్జీకి గురికాకుండా కాపాడుతుంది.

62 ఏళ్ల మహిళకు..

ఒక సంవత్సరం క్రితం స్ట్రోక్ బారిన పడి కోలుకున్న 62 సంవత్సరాల మహిళకు డాక్టర్ ఆదిత్య కపూర్ విజయవంతగా పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికత్సను నిర్వహించారు. మోకాలి కీలు ప్రభావిత కంపార్ట్మెంట్ను మాత్రమే రీప్లేస్ మెంట్ చెశామన్నారు. అదేరోజు ఆమెను నడిపించినట్టు ఆయన అన్నారు. చిన్న కోత ద్వారా సర్జరీ నిర్వహించడం వలన ఆమె వేగంగా కోలుకోవడం, అతి తక్కువ బ్లడ్ లాస్ తో పాటు మరుసటి రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసినట్టు డాక్టర్ ఆదిత్య కపూర్ వివరించారు .

శరీరంలో మెటల్ అలెర్జీలను ఆరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ బయోనిక్ గోల్డ్ ఇంప్లాంట్ ను తరయారు చేశారని ఇది ఇతర వైద్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News