గోల్డ్ లోన్స్(Gold loans) తీసుకునే వారు ఇకపై ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకంటే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో జారీ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇటీవల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. వివిధ రకాల గోల్డ్ లోన్స్ సంస్థలు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సమన్వయం చేయడంతో పాటు సాధ్యమైనంత వరకు రిస్క్ తగ్గించేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్
మల్హోత్రా తెలిపారు.
కాగా రుణాల జారీ విషయంలో ఆర్థిక సంస్థలు ఒకేతరహా విధానాలు పాటించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి నగదు వినియోగం, వేలం వరకు విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయంతో ముత్తూట్ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ వంటి రుణ జారీ సంస్థల షేర్లు భారీగా క్షీణించాయి