రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు ప్రకటించలేదు. రెపో రేటులో మార్పులు చేయలేదు. దీంతో 6.5 శాతం వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించటంపై మానిటరీ పాలసీ కమిటీ సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. గతేడాది మేలో 250 బేసిస్ పాయింట్లను సెంట్రల్ బ్యాంక్ పెంచింది. ద్రవ్యోల్బణం, అకాల వర్షాలు, మార్కెట్లో విపరీతమైన ఒడిదుడుకులు, పెట్రోలియం ఉత్పత్తులు తగ్గించాలన్న ఒపెక్ దేశాల నిర్ణయం వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్న శక్తికాంత్ వివరించారు.