Sunday, September 8, 2024
Homeట్రేడింగ్Ready made house: రెడీమేడ్ ఇళ్లకు ఫుల్ డిమాండ్

Ready made house: రెడీమేడ్ ఇళ్లకు ఫుల్ డిమాండ్

బట్టలే కాదు రెడీమేడ్ ఇళ్లు కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. పైగా, ఆ ఇళ్లను మనకు నచ్చిన చోటుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా తీసుకెళ్లడానికి కూడా వీలవుతుంది. అవి
స్థలం కొనాల్సిన అవసరం లేకుండా ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసుకునేందుకు ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి.తాత్కాళిక ఇళ్లు కావాల్సిన వారి కోసం రెడీమేడ్ మూవబుల్ ఇళ్లు తయారు చేసే కంపెనీలు కూడా పెరిగిపోతున్నాయి.
తక్కువ స్థలంలో ఇళ్లు కట్టుకోవాలన్నా ఈ రోజుల్లో లక్షలు పెట్టనిది కుదరని పని.కానీ రెడీమేడ్ ఇళ్ల నిర్మాణం చాలా తక్కువ ధరలో పూర్తవుతుంది.ఇవి ఎండా కాలమైనా, వానాకాలం అయినా తట్టుకుంటాయి. ఎందుకంటే ఈ మూవబుల్ రెడీమేడ్ ఇళ్లను చుట్టూ స్టీల్ తో బాడీ చాలా దృఢంగా నిర్మిస్తారు. ఇంతకుముందు చిన్న దుకాణాలు, కార్యాలయాలను స్టీలు బాడీలతో నిర్మించేవారు.సేమ్ ఇదే పద్ధతిని ఇప్పుడు రెడీమేడ్ ఇళ్లు, ఆఫీసుల నిర్మాణంలో కూడా పాటిస్తున్నారు.గుంటూరు-విజయవాడ నేషనల్ హైవేకి సమీపంలో మూవబుల్ హౌజ్‌లను ఒక కంపెనీ తయారు చేస్తోంది. బెడ్ రూమ్, కిచెన్, టాయిలెట్లు, హాల్ వీటన్నిటితో కలిపి 200 అడుగుల నుంచి 360 అడుగుల వరకు విస్తీర్ణం ఉండేలా వీరు తరహా ఇళ్లను తయారు చేస్తున్నారు.వీటి తయారీ ఖర్చు నాలుగు లక్షల వరకు అవుతుంది.లోపల ర్యాక్ ఊల్ ఫ్లైవుడ్ మెటీరియల్ ఉపయోగించడం వల్ల వేడి తగ్గుతుందని చెబుతున్నారు.అలాగే శబ్దాలు కూడా ఇంటి లోపలికి ఎక్కువగా రావట.ఇక అగ్ని ప్రమాదాలు జరగకుండా బయట భాగాలన్నీ స్టీల్ తో తయారు చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News