అమెరికాలో ఆర్థిక మాంద్యం స్టార్ట్ అవ్వగా 2023లో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద కుదుపు తెస్తుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ లో అమెరికన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఢమాల్ అవుతుందని Goldman Sachs వంటి దిగ్గజ సంస్థళు అంచనా వేసి, అమెరికన్లను హెచ్చరిస్తున్నాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా న్యూ ఇయర్ లో ఇళ్ల ధరలు పడిపోతాయని అంచనా వేస్తున్నాయి 7 అమెరికన్ దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు. హౌసింగ్ లోన్లపై వడ్డీల భారం తడిసి మోపుడ కానుండడం, ఈఎంఐల భారం పెరగనుండటం వంటి కారణాలతో అమెరికాలో 5-10శాతం ఇళ్ల ధరలు కరెక్షన్ అవ్వటం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ అమ్ముడుబోని యూనిట్స్ మిగులుతాయన్న అంచనాల కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా నేలచూపులు చూస్తోంది. 2023సెకెండ్ హాఫ్ లో ఇక్కడి ఇళ్ల ధరలు 25శాతం తగ్గినా అశ్చర్యపోనవసరం లేదని ఎకానమిస్టులు చెబుతున్నారు. 2008లో కూడా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో రెంటల్ ఇళ్లకు విపరీతమైన గిరాకీ వచ్చిపడింది.