దేశంలో జీఎస్టీ వసూళ్లు(GST Collection) సరికొత్త రికార్డు సృష్టించాయి. 2025 ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంత భారీ మొత్తం వసూలు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ప్రస్తుత వసూళ్లలో 12.6 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన పన్ను మొత్తం రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 10.7 శాతం అధికంగా ఉంది. దేశంలో వివిధ పరోక్ష పన్నుల స్థానంలో 2017 జులై 1 నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.