రైస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ (RICE- 2024) హైదరాబాద్ లో ఘనంగా సాగింది. జాతీయ-అంతర్జాతీయ పరిశోధకులను, ప్రముఖ విద్యావేత్తలను, నిష్ణాతులైన అభ్యాసకుల సమావేశం జరిగింది. ఇంజినీరింగ్, దాని అనుబంధ సబ్జెక్టుల్లో పరిశోధకులకు, బోధనా సిబ్బందికి అవసరమైన జ్ఞానాన్ని మెరుగుపరచడానికి శక్తివంతమైన వేదికను అందించేలా ఇలాంటి సమావేశాలు సహకరిస్తాయని సభికులన్నారు.
ప్రతి డొమైన్‌లో AI ఎలా అనివార్యమైందో, సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఇంజినీరింగ్, మరిన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు చేయడం గురించి సదస్సులో పాల్గొన్న నిపుణులు వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సత్య ప్రసాద్ లంక, న్గుయెన్ హాంగ్ సన్ (హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హనోయి యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ, హనోయి, వియత్నాం), ప్రొఫెసర్ డాక్టర్ మిధున్ చక్రవర్తి (డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ AI కంప్యూటింగ్ అండ్ మల్టీమీడియా, లింకన్ యూనివర్శిటీ, మలేషియా), డాక్టర్ అతుల్ నేగి (ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.
దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జాతికి చేసిన అపారమైన సేవలను ఈ సమావేశం గుర్తుచేసుకుని, నివాళి అర్పించింది.