Sunday, January 5, 2025
Homeట్రేడింగ్RS Brothers Vizag: విశాఖలో అతిపెద్ద సరికొత్త షోరూమ్‌కు శుభారంభం చేసిన ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌

RS Brothers Vizag: విశాఖలో అతిపెద్ద సరికొత్త షోరూమ్‌కు శుభారంభం చేసిన ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌

సూపర్ డీల్స్

వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి.వెంకటేశ్వర్లు, ఎస్‌.రాజమౌళి, టి. ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో, షాపింగ్‌ ప్రియుల సంతోషదాయక గమ్యమైన ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ విశాఖపట్నంలో అతిపెద్ద షోరూమ్‌ను జగదాంబ సెంటర్‌లో జనవరి 2న సగర్వంగా శుభారంభం చేసింది. సాగర తీరంలో షాపింగ్‌ అనుభవాన్ని అందించే ఈ సరికొత్త షోరూమ్‌- అటు సంప్రదాయ వస్త్రప్రియుల్ని, ఇటు అధునాతన జీవనశైలిని అభిమానించే వారిని సమానంగా ఆకర్షించే స్థాయిలో రూపుదిద్దుకోవటం విశేషం. మ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు, బండారు సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌ షోరూమ్‌కు శుభారంభం చేశారు.

- Advertisement -

ఆనందం-ఆశ్చర్యం రెండూను

ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి ఈ షోరూమ్‌కు శుభారంభం చేశారు. కొత్త సంవత్సరంలో సరికొత్త షాపింగ్‌ అనుభవాన్ని అందించే ఈ షోరూమ్‌లోని వైవిధ్యభరిత వస్త్రశ్రేణి చూసి తనకు ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయని మీనాక్షి చౌదరి అన్నారు. నేత్రపర్వంగా జరిగిన వేడుకలో మీనాక్షి చౌదరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ ఒక విశ్వసనీయమైన బ్రాండ్‌గా తెలుగువారు ఏకగ్రీవంగా ఆమోదించారు. అందుబాటు ధరల్లో అత్యంత నాణ్యమైన వస్త్రాలకు పెట్టింది పేరుగా రెండు తెలుగు రాష్ట్రాల వస్త్రప్రియులు ముక్తకంఠంతో ఆమోద ముద్ర వేశారు. విశాఖవాసుల అభిమాన షోరూమ్‌గా ఇది త్వరలోనే ఆదరణ పొందుతుంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ షోరూమ్‌ విస్తృతస్థాయిలో అందిస్తున్న ప్రారంభ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ నగరవాసుల్ని ఆహ్వానిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

అందుబాటు ధరలో నాణ్యమైన
ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌ రీటైల్‌ ఇండియా ప్రై.లి. డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, ఎస్‌.రాజమౌళి, టి. ప్రసాదరావు విశాఖ పారంపర్య వైభవంగా ఈ అతిపెద్ద సరికొత్త షోరూమ్‌ను సమర్పించడం తమకు గర్వకారణంగా ఉందని హృదయపూర్వక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుబాటు ధరలలో విశేషమైన నాణ్యత కలిగిన వస్త్రాలను విశాఖ నగరవాసులకు అందించాలన్న దార్శనికత ఈ అతిపెద్ద షోరూమ్‌ ఆవిష్కరణ ద్వారా నేడు సాకారమైందని మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. నగరంలోని ప్రముఖ వ్యూహాత్మక ప్రాంతాలలో మరిన్ని షోరూమ్‌లు నెలకొల్పే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, జగదాంబ సెంటర్‌ షోరూమ్‌లోనే రూ.150ల కనిష్ట ధరతో ఆరంభించి, మహిళలకు, పురుషులకు, పిల్లలకు సరిగ్గా సరిపోయే లక్షలాది వెరైటీలు కలిగిన వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఉందని, అదేవిధంగా సంక్రాంతికి అత్యంత ప్రత్యేకమైన ఆఫర్లను సంస్థ డైరెక్టర్లు వివరించారు.
సంస్థ డైరెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు వివరిస్తూ ‘‘నాణ్యతలో అగ్రస్థానానికి చేరినా, కంచిపట్టు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, బ్రాండెడ్‌ మెన్స్‌వేర్‌, ఎత్నిక్‌ వేర్‌, కిడ్స్‌ వేర్‌లను పోటీ ధరలకు ఇక్కడ విక్రయిస్తున్నామనీ, ఈ సంక్రాంతి పర్వదినానికీ, రాబోయే వివాహ వేడుకలకూ సరిపోయే వస్త్రశ్రేణిని కొనుగోలు చేసేందుకు జగదాంబ సెంటర్‌లోని అతిపెద్దదైన మా సరికొత్త షోరూమ్‌కు తప్పకుండా విచ్చేయమని విశాఖపట్నం వస్త్రాభిమానుల్ని ఆహ్వానిస్తున్నా’’నని చెప్పారు.
మరో డైరెక్టర్‌ ఎస్‌. రాజమౌళి మాట్లాడుతూ, ‘‘అత్యంత నైపుణ్యంతో రూపొందించిన విస్తృతశ్రేణికి చెందిన ఫ్యాన్సీ చీరలు, ప్రీమియం స్థాయి బ్రాండెడ్‌ మెన్స్‌వేర్‌ విశాఖలోని అతిపెద్దదైన తమ సరికొత్త షోరూమ్‌లో లభిస్తున్నాయని, ప్రారంభోత్సవ సందర్భంగా ఎంపిక చేసిన కలెక్షన్లపై 1+1 ఆఫర్‌, మరియు 50% వరకు తగ్గింపు అందజేస్తున్నామని, కావున వస్త్రాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని’’ తెలియజేశారు.

ఇంటింటి షాపింగ్ గమ్యం
సంస్థ మరో డైరెక్టర్‌ టి. ప్రసాదరావు జగదాంబ సెంటర్‌లోని తమ సరికొత్త షోరూమ్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విశాఖ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఇంటింటి షాపింగ్‌ గమ్యం’ స్థాయికి చేరుకున్న ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ షోరూమ్‌ను విశాఖ వాసులు ‘కుటుంబ షాపింగ్‌’ గమ్యంగా ఆశీర్వదించారని, వారి విశాల హృదయానికి తమ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో నాణ్యతలో రాజీపడని సేవలను అందించగలమని మన్నారు. ప్రారంభ ఆఫర్‌గా అన్నిరకాల సిల్క్‌చీరల పైనా, గార్మెంట్స్‌ పైనా ‘కాస్ట్‌-టు-కాస్ట్‌ విక్రయాల’ ను ప్రకటించామని కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News