2024లో ఏకంగా 60 కోట్ల రూపాయల నూడుల్స్ తినేశారు. అది కూడా దేశమంతా కలిసి కాదు కేవలం ఒక్క సిటీవాళ్లే ఇన్ని నూడుల్స్ ఒక్క ఏడాదిలో తినేశారంటే షాకింగ్ గా ఉందికదా. రాజధాని ఢిల్లీ సిటీలో నూడుల్స్ కు ఉన్న డిమాండ్ ఈ రేంజ్ లో ఉందిమరి. ఇండియాలో నూడుల్స్ కు ఆల్టర్నేటివ్ లేదు, నూడుల్స్ ఆల్ టైం ఫేవరెట్ అని మరోసారి ప్రూవ్ అయ్యేలా ఈ నూడుల్స్ ఆర్డర్లు స్విగ్గీలో జరిగాయి.
నిమిషానికి 273 చాక్లెట్స్
2024 జనవరి 1వ తేదీ నుంచి ఇదే ఏడాది డిసెంబర్ 1 వరకు జరిగిన ఈ ఆర్డర్స్ ఢిల్లీలో జరిగినట్టు స్విగ్గీ చెప్పటం విశేషం. రక్షాబంధన్ రోజు అత్యధికంగా 2,85,000 డెలివరీలు ‘ఆర్డర్ ఫర్ అదర్స్’ కేటెగెరీలో ఈ ఇయర్ బుక్ అయినట్టు స్విగ్గీ చెబుతోంది.
ఇక నిమిషానికి 273 చాక్లెట్ల ఆర్డర్స్ కూడా కూడా ఇదే రోజు వచ్చాయని స్విగ్గీ చెబుతుంటే మనోళ్లకు చాక్లెట్లు అంటే ఎంతిష్టమో మళ్లీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తోంది.