Friday, November 8, 2024
Homeట్రేడింగ్Sachin the Global brand ambassador of Bank of Baroda: బ్యాంక్ ఆఫ్...

Sachin the Global brand ambassador of Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్

బీవోబీ  మాస్టర్‌స్ట్రోక్ సేవింగ్స్ ఎక్కౌంట్

బ్యాంక్ ఆఫ్ బరోడా తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్‌తో ఐకానిక్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

- Advertisement -

బీఓబీ స్థాయిని పెంచేలా సచిన్..

  • సచిన్ శ్రేష్ఠత, విశ్వాసం, ఆయనకున్న ప్రజాదరణ అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో ఒకటిగా బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాయిని మరింత పెంచుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా పరివర్తన ప్రయాణంలో కొత్త దశను సూచిస్తుంది. ‘బీవోబీ  మాస్టర్‌స్ట్రోక్ సేవింగ్స్ ఎక్కౌంట్’ పరిచయం చేస్తూ, ఈ  ప్రీమియం బ్యాంక్ ఖాతా అనేక సేవలను అందిస్తుంది.

ఇది వ్యూహాత్మక ఒప్పందం..

 విస్తృత శ్రేణిలో అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న , భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా, తమ  బ్యాంక్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఈ రోజు వెల్లడించింది. సచిన్ టెండూల్కర్-బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం శ్రేష్ఠత & విశ్వాసం వంటి ప్రధాన విలువలపై నిర్మించబడింది.  సచిన్ బ్రాండ్ గుర్తింపుపై ఆధారపడి, వేగవంతమైన వృద్ధి పథాన్ని అనుసరిస్తున్నందున, బ్యాంక్ ఆఫ్ బరోడా దాని పరివర్తన ప్రయాణం తదుపరి దశను ముందుకు తీసుకువెళ్ళడానికి  సిద్ధంగా ఉన్న వేళ,  ఈ భాగస్వామ్యం సరైన సమయంలో వచ్చింది.

 ఈ భాగస్వామ్యంలో భాగంగా సచిన్‌తో కలిసి  తమ మొదటి ప్రచారంను   “ప్లే ది మాస్టర్‌స్ట్రోక్” పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది. లక్షలాది మంది విశ్వసించే మరియు శతాబ్దానికి పైగా వారసత్వం ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవడం ద్వారా తమ  ఆర్థిక ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి, మాస్టర్‌స్ట్రోక్ ఆడమని, పెద్ద స్కోర్ చేయమని ప్రచారం ప్రజలను ప్రోత్సహిస్తుంది.

పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సచిన్..

 దేశం నలుమూలల నుండి అభిమానులను కలిగి ఉండటం, భారతదేశం వైవిధ్యమైన జనాభాను కారణంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా అన్ని బ్యాంక్ బ్రాండింగ్ ప్రచారాలు, వినియోగదారుల విద్య & ఆర్థిక అక్షరాస్యత & మోసాల నివారణ, కస్టమర్, ఉద్యోగి అవగాహన కార్యక్రమాలలో సచిన్ పాల్గొంటారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం  17 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గ్లోబల్ స్పోర్టింగ్ ఐకాన్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాండ్‌ను అంతర్జాతీయంగా విస్తరింప జేయటంలో సచిన్ సహాయపడతారు. 

తరాలను మించిన వారసత్వం – శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణం..

 ఈ భాగస్వామ్యం  గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ దేబదత్త చంద్ మాట్లాడుతూ “భారతదేశ క్రీడా దిగ్గజాలలో ఒకరైన సచిన్ టెండూల్కర్‌ను మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవటాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా గౌరవంగా భావిస్తుంది. సచిన్ తన చర్యల ద్వారా మనకు స్ఫూర్తినిస్తూనే,  ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచే గ్లోబల్ ఐకాన్ గా నిలుస్తుంటారు. అతను గ్రౌండ్ లోపల, బయట తన అద్భుతమైన కెరీర్ ద్వారా స్ఫూర్తిని కలిగించారు. తన అద్భుతమైన కెరీర్ తో దేశానికి ఉత్సాహం తీసుకువచ్చినట్లుగానే,  బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా మిలియన్ల మందికి విశ్వసనీయ భాగస్వామిగా ఉంది, వారు తమ ఆర్థిక లక్ష్యాలు సాధించటంలో సహాయ పడుతుంది.  నాయకత్వం, శ్రేష్ఠత, విశ్వాసం, స్థిరత్వానికి స్ఫూర్తికి ప్రతీకగా సచిన్ నిలిస్తే, తరాలను మించిన వారసత్వం – శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణంలో ప్రధానముగా ఏర్పరుచుకున్న  విలువలతో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వెళ్తుంది.  సచిన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవటానికి, ఈ అనుబంధానికి జీవం పోయడానికి మేము సంతోషిస్తున్నాము..” అని అన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News