స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ స్థానిక ప్రధాన కార్యాలయం, స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఎస్బీఐ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, ఎల్హెచ్ఓ ప్రాంగణంలోని నార్తర్న్ లాన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీజీఎం రాజేష్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం ఆర్థిక వృద్ధికి ఇంజిన్ మాత్రమే కాదు, సామాజిక పురోగతికి మూలస్తంభం అన్నారు. ఇది పౌరులకు అధికారం ఇస్తుంది, ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుందని, దేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాల ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, బ్యాంకింగ్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిలో తాము అద్భుతమైన మార్పులను చూసినట్టు ఆయన వివరించారు. గ్రామీణ వ్యవస్థాపకులు, రైతులకు మద్దతు ఇవ్వడం నుండి చిన్న వ్యాపారాల కలలను సాకారం చేయడంతో పాటు ప్రతి పౌరుడికి సజావుగా, సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాలను అందిస్తూనే ఉన్నట్టు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, బ్యాంకు సిబ్బంది, వారి కుటుంబాలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలో దేశభక్తి గీతాలు, నృత్యాలు, ఇతర ప్రదర్శనలతో సభికులను అలరించారు.