Wednesday, October 30, 2024
Homeట్రేడింగ్South India Shopping Mall 35th branch launched in Anantapuram: అనంతపురంలో సౌత్ ఇండియా...

South India Shopping Mall 35th branch launched in Anantapuram: అనంతపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూం ప్రారంభం

నిధి అగర్వాల్, అనసూయ చేతుల మీదుగా..

తమ అభిమాన కస్టమర్ల కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనంతపురంలో సరికొత్త షోరూం ప్రారంభించింది.  అనంతపురం పరిసరాల్లోని వినియోగదారుల షాపింగ్ అవసరాలను తీర్చేందుకు అనుగుణంగా ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతితో పాటు వైవిధ్యభరితమైన వస్త్రశ్రేణితో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 35వ షోరూంను అనంతపురంలో ప్రారంభించటం విశేషం.

- Advertisement -

లోక్ సభ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి సంస్థ అధినేత పీ వెంకటేశ్వరులు, ఎస్ రాజమౌళి అతిథులుగా పాల్గొన్నారు. 

నిధి అగర్వాల్, అనసూయ చేతుల మీదుగా..

సినీ నటులు నిధి అగర్వాల్, అనసూయా భరద్వాజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను జ్యోతి ప్రజల్వనం చేసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా హీరోయిన్ నిధి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతానికి తలమానికంగా అనంతపురం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్థానికుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టు షాపింగ్ అవసరాలు తీర్చుతుందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు.  అన్ని తరాల, తరగతుల వస్త్ర ప్రియులకు పండగలు, శుభకార్యాలకు ఇక్కడికి వచ్చి షాపింగ్ ఆస్వాదించాలని నిధి అన్నారు.   విక్రయ సేవలు, షాపింగ్ ఆఫర్లను వినియోగించుకోవాలని ఆమె అన్నారు.

చిరకాల అనుబంధమన్న అనసూయ..

నాణ్యతకు, వెరైటీలకు కేరాఫ్ గా మారిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తో తనకు చిరకాల అనుబంధం ఉందని మరో నటి అనసూయ అన్నారు. తాను ఎన్నోసార్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసినట్టు, ఇక్కడ షాపింగ్ చేయటం ప్రతిసారీ వినూత్న అనుభూతిని ఇస్తుందన్నారు.  సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అడుగు పెట్టిన ప్రతిసారి కళ్లు మిరుమిట్లుగొలిపే మాడర్న్ ట్రెండ్స్ తనను ఆకట్టుకుంటాయని అనసూయ అన్నారు.   ఈ నేపథ్యంలో అనంతపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 35వ షోరూం ఇక్కడ జ్యోతిని వెలిగించటం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు.  ఇక్కడి ట్రెండీ వెరైటీలను ముచ్చటగా చూడటం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు.  పండుగలు, శుభకార్యాలూ ఏవైనా అనంతపురం వినియోగదారుల అభిరుచులకు సరితూగేలా ఎన్నో వెరైటీలు ఈ మాల్ లో ఉన్నాయని అనసూయ తన మాటల్లో అభివర్ణించారు.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ ..అనంతలోని తమ అభిమాన కస్టమర్ల విస్తృత షాపింగ్ అవసరాలు, వారి సంపూర్ణ సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ప్రవేశపెడుతున్న పలు ఆఫర్లు, వెరైటీలు, తెలుగు రాష్ట్రాల్లో చేపట్టబోతున్న భావి విస్తరణ మొదలైన అంశాలను మీడియాకు వివరించారు.  నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తూ, అంకితభావంతో కృషి చేయటం, పోటీ ధరలతో వస్త్రాభరణాలు అందించటంలో ముందుండటమే తమ సంస్థ ధ్యేయం అన్నారు.  వివిధ రకాల పండుగలు, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన ఆషాఢమాసం ఆఫర్లు అందిస్తున్నామన్నారు.

మరో డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ..కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల వంటి పేరెన్నికగన్న వస్త్రాల వెరైటీలతో కూడిన కళాత్మక పట్టు వస్త్రాల విభాగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ రాకేశం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లోని ఫ్యాషన్ స్టోర్లలోకెల్లా అతి పెద్దదైన తమ అనంతపురం షోరూం ప్రత్యేకత గురించి, అందులో లభించే విస్తృ శ్రేణికి చెందిన మెన్స్ వేర్, అధునాత బ్రాండ్స్, వాటిపై లభించే స్పెషల్ ఆఫర్ల గురించి వివరిస్తూ రాబోయే పెళ్లిళ్లు, పండుగల సీజన్లో విస్మయం కలిగించే పథకాలు అందించబోతున్నామన్నారు.

మరో డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ..మహిళా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు సరికొత్త ఫ్యాషన్లు, డిజైన్లు తమ షోరూంలో అందుబాటులో ఉంచామన్నారు.  చుడీదార్, లెహంగాలు, లెగ్గింగ్, కిడ్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్ అన్ని రకాల ట్రెండీ వస్త్రాల కోసం ఈ షోరూంకు విచ్చేయాల్సందిగా కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News