Thursday, December 12, 2024
Homeట్రేడింగ్South India Shopping Mall in Ongole: ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్...

South India Shopping Mall in Ongole: ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం

38వ షోరూం

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 38వ షోరూమ్కు డిసెంబరు 12న ఒంగోలులో గొప్ప ప్రారంభం

- Advertisement -

అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవన శైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు – సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్ను కర్నూలు రోడ్, ఒంగోలులో 2024 డిసెంబరు 12న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించింది. దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు శాసనసభ సభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్, సంతనూతలపాడు శాసనసభ సభ్యులు గందాడ సుజాత, మేయర్ వేమూరి భవాని, 48వ డివిజన్ కార్పొరేటర్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 38వ షోరూము శుభారంభం చేశారు.

అన్ని తరాలు, తరగతులను అలరించేలా

ప్రముఖ తారామణి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి, సరికొత్త షోరూంకు శుభారంభం చేశారు. ఈ విశేష కార్యక్రమం కలకాలం గుర్తుండిపోయేలా, వస్త్ర ప్రియులు ఆనందించేలా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు తమ ప్రత్యేకతను చాటి చెప్పారు. విస్తారమైన ఈ షోరూమ్- సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ తాలూకు అంకిత భావానికి, ప్రత్యేకతకు గుర్తుగా కొనుగోలుదారులను అలరిస్తోంది. వివాహాది శుభకార్యాలు మొదలుకుని, ప్రత్యేక పర్వదినాల వరకు అన్ని తరాలను, తరగతులను అలరించే లక్షలాది వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం.

వస్త్రప్రియుల అభిరుచులను దృష్టిలో

ఈ శుభ సందర్భాన్ని ప్రతిబింబిస్తూ, స్థానికులకు సౌత్ ఇండియా షాపింగ్మాల్ సంస్థ డైరెక్టర్లు సురేశ్ సీర్ణ, అభినయ్,రాకేశ్, కేశవ్ స్వాగతం పలికారు. అదే సమయంలో ఒంగోలు పరిసర ప్రాంత వస్త్రప్రియుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని విశేష సేవలు అందిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి అంకిత భావాన్ని ప్రశంసిస్తున్న కొనుగోలుదారులందరికీ సంస్థ డైరెక్టర్లు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను, సంతోషాన్నీ వ్యక్తం చేశారు.

38వ షోరూం

సంస్థ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ, “ఒంగోలులో మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూము శుభారంభం చేయడం మాకెంతో ఆనందదాయకం. ఒంగోలు వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికీ పెద్దపీట వేసి, వారి అభిరుచులను అడుగడుగునా ప్రతిబింబించే వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని, షాపింగ్ అనుభూతిని ఒకేచోటకు తీసుకురావటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం” అన్నారు.

రాబోయే పండుగల కోసం

సంస్థ మరో డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ- “రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా, ఆకర్షణీయ షాపింగ్ గమ్యస్థానంగా కొనుగోలుదారులు తప్పక అభిమానిస్తారని” అన్నారు.

వస్త్రాభిమానులకు స్వాగతం

స్థానిక వస్త్రాభిమానులను స్వాగతిస్తూ మరో డైరెక్టర్ రాకేశ్, “ఒంగోలులోనే అతిపెద్ద షోరూమైన మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు- ధరలోనూ, నాణ్యతలోనూ, వస్త్రప్రియుల అభిరుచులను ప్రతిబింబిస్తూ, వారిని అలరించడంలో తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అన్నిరకాల ఆదాయవర్గాల వారికీ అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత” అన్నారు.

వైవిధ్యం కోరుకునే వారికోసం

సంస్థకు చెందిన ఇంకో డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ, “వైవిధ్యభరితమైన వస్త్రాలను కోరుకునే వారి కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్ను శుభారంభం చేయటం మాకు గర్వకారణం, ఆనందకరం. స్థానిక కొనుగోలుదారుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం సంతోషదాయకం. వారు కోరుకునే ప్రతి వెరైటీని అందించేందుకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం” అన్నారు.

అనేక ప్రత్యేకతలు

కర్నూల్ రోడ్, ఒంగోలులో అనేక ప్రత్యేకతలు కలిగిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఈ 38వ షోరూమ్ను సందర్శించిన ప్రతి ఒక్కరు- సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ శాఖలను విస్తరించటంతోబాటుగా రీటైల్ రంగంలో ధర, నాణ్యతలకు సంబంధించిన సరికొత్త, సమున్నత ప్రమాణాలను సైతం పెంపొందిస్తూ, నేతృత్వ లక్షణాలతో అగ్రగామిగా నిలుస్తోందని. వివాహాది శుభాకార్యాలకు, విశేష పర్వదినాలకు వస్త్రాభిమానులకు ఇది వినూత్న గమ్యం కాగలదని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News