సర్క్యూట్స్, సిగ్నల్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్ లాంటి వాటి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి వినియోగాలను కూడా అర్థం చేసుకోవాలంటూ ఆసక్తికరమైన వర్క్ షాప్ ను నిర్వహించింది స్టాన్లీ వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్. ఫిజిక్స్ అంటే జస్ట్ క్లాసులో చదువుకోవటం కాకుండా ప్రయోగాత్మకంగా ఎలా ఉపయోగించాలనే అంశంపై పట్టు సాధించాలని స్టాన్లీ కాలేజ్ ఫిజిక్స్ హెచ్ఓడీ డాక్టర్ జి పద్మశ్రీ అన్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడంలో మాత్రమే కాకుండా, ఆధునిక జీవితాన్ని సులభతరం చేసేందుకు ఫిజిక్స్ పనికొస్తుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్ రెడ్డి అన్నారు.
వర్క్ షాప్ నిర్వహణలో భాగంగా పిఎన్ జంక్షన్ డయోడ్, ట్రాన్సిస్టర్ వినియోగం, ఎల్ఈడి ఉపయోగాలు, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పరిశీలనకు సంబంధించి పరికరాల ద్వారా విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా వివరించారు.
స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భౌతిక శాస్త్ర ప్రయోగాల వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భౌతిక శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ జి పద్మశ్రీ కన్వీనర్ గా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్ రెడ్డి, ప్రధాన శిక్షకులుగా వివివి సత్యనారాయణ, కళాశాల రీసెర్చ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సి విష్ణువర్ధన్ రెడ్డి, డీన్ (అకాడమిక్స్) ప్రొఫెసర్ ఏ వినయ్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యప్రసాద్ లంక, డైరెక్టర్, మేనేజ్మెంట్ సభ్యులు టి రాకేష్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, రెస్పాండెంట్ శ్రీ కే కృష్ణారావు గారు, మేనేజ్మెంట్ సభ్యులు ఆర్ ప్రదీప్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రమేష్, వర్క్ షాప్ కో కన్వీనర్స్ జేపీ ప్రమోద్, డాక్టర్ పి అనూష, శ్రావణి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.