Sunday, October 27, 2024
Homeట్రేడింగ్Swiggy IPO: త్వరలోనే మార్కెట్‌లోకి స్విగ్గీ ఐపీవో.. ఎప్పటి నుంచంటే..?

Swiggy IPO: త్వరలోనే మార్కెట్‌లోకి స్విగ్గీ ఐపీవో.. ఎప్పటి నుంచంటే..?

Swiggy IPO| ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీవో (Swiggy IPO) త్వరలోనే ప్రారంభం కానుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించాక.. ఈ ఐపీవో ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మదుపర్లకు కంపెనీ నుంచి గుడ్ న్యూస్ లభించింది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో ద్వారా దాదాపు రూ.10వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

- Advertisement -

ఇందులో షేర్ల విక్రయం ద్వారా రూ. 4000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 6000 కోట్లను సమీకరించాలని ప్రయత్నిస్తోంది. అలాగే ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లు సమీకరించాలని కూడా స్విగ్గీ చూస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లు రెండు రోజుల పాటు జరిగి నవంబర్‌ 8న ముగియనున్నట్లు తెలుస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు ముందే ఇది మొదలుకానుంది. అయితే ధరల శ్రేణి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే స్విగ్గీ ఐపీవోగా లిస్టింగ్ కాకముందే మార్కెట్లో దీనికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొందరు ప్రముఖులు దాదాపు 20 వేల షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరిలో రాహుల్ ద్రావిడ్(Rahul Dravid), జహీర్ ఖాన్(Zaheer Khan), రోహన్ బోపన్న(Rohan Bopanna), కరణ్ జోహార్(Karan Johar) లాంటి ఉన్నారని తెలుస్తోంది.

కాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ స్విగ్గీని 2014లో స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు ఐపీవో ద్వారా 15 బిలియన్ డాలర్లు విలువ చేసే కంపెనీగా అవతరించాలని చూస్తోంది. 2022లో చివరిసారిగా నిధులను సమీకరించడంతో కంపెనీ విలువ 10.7 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఏప్రిల్‌ 30న కాన్ఫిడెన్షియల్‌ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇదే విభాగంలో 2021లో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన జొమాటో ఐపీవో ధర కంటే 52శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయింది. అనంతరం కూడా మంచిగా షేర్లు రాణిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News