కార్పొరేట్ లీడర్షిప్ ను విద్యార్థి దశలోనే వెలుగులోకి తీసుకువచ్చేందుకు స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ లీడర్షిప్ నిపుణులతో ప్రత్యేక సింపోజియం నిర్వహించి, విద్యార్థులకు దశ, దిశను నిర్దేశించే ప్రయత్నం చేసింది.
స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ “ఫాస్టరింగ్ ఆన్ ఎంట్రప్రెన్యూరియల్ మైండ్‌సెట్: ఎంపవరింగ్ ఇంజనీర్స్ విత్ కార్పోరేట్ లీడర్‌షిప్” అనే పేరుతో సింపోజియంను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ సీనియర్ డైరెక్టర్ లక్ష్మీ చావలి, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ రిషి వర్మ సహా ప్రముఖ అతిథులు, వక్తలు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు అవసరమైన కార్పొరేట్ నాయకత్వ నైపుణ్యాలతో ప్రేరేపించడం సన్నద్ధం చేయటమే సింపోజియం లక్ష్యంగా పెట్టుకుంది.