Homeట్రేడింగ్Coconut Water Coffee: కొబ్బరి నీళ్లతో కాఫీ.. వైరల్‌గా చల్లచల్లని పానీయం

Coconut Water Coffee: కొబ్బరి నీళ్లతో కాఫీ.. వైరల్‌గా చల్లచల్లని పానీయం

Coconut Water Coffee: ప్రస్తుత లైఫ్‌స్టైల్లో కొత్త కొత్త ట్రెండ్స్‌ పుట్టుకోస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోకటి అంశం ట్రెండ్‌ అవుతుంది. లైఫ్‌స్టైల్‌, ఫుడ్‌, ఫిట్ నెస్‌లో విషయంలో ప్రజలు భిన్నరకమైన పొకడలు పోతున్నారు. ఈ క్రమంలో కొత్త ట్రెండ్‌కి ఆకర్షితులు అవుతున్నారు. అయితే, కరోనా సమయం నుంచి ప్రతి ఒక్కరి లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయి.

- Advertisement -

కొత్త ట్రెండ్
ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ ఎక్కువగా పెరిగింది. ఇందులో భాగంగా వారి డైట్‌కి సంబంధించిన ఎన్నో కొత్త రకం వంటకాలు బయటకు వచ్చాయి. అందులో కాఫీపై కూడా కొత్త కొత్త ప్రయోగాలు జరిగాయి. సోషల్ మీడియాలో ఇవి ట్రెండ్స్‌గా మారి వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి మరో కొత్త కాఫీ ట్రెండ్ కాఫీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే… పాలు లేదా సాధారణ నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్లతో కాఫీ తయారు చేయడం.

వేసవి కూల్ డ్రింక్..
ఇదే ఈ ట్రెండ్ యొక్క అసలు సీక్రెట్. ఆరోగ్యానికి మంచిదని భావించి చాలామంది దీనిని ట్రై చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కాఫీ తయారీలో ఐస్ క్యూబ్స్, క్రీమ్, కాఫీ పొడి.. తమకు నచ్చినంతగా వేసుకుని చల్లగా తాగితే ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. వేసవిలో ఇది మంచి కూల్ డ్రింక్‌గా, ట్రోపికల్ ఫీలింగ్ ఇచ్చే పానీయంగా మారిందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు రసగుల్లా కాఫీ ట్రెండ్ వైరల్ కాగా… ఇప్పుడు కొబ్బరి నీళ్ల కాఫీ ట్రెండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Micro Mance Trend: అసలేంటి ఈ మైక్రో రొమాన్స్ ట్రెండ్.. రిలేషన్‌షిప్‌లో దీని ప్రభావం ఏంటో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News