Wednesday, December 18, 2024
Homeట్రేడింగ్Warangal: వ్యాపారస్తులకు అండగా ఉంటా, ముకుంద జ్యువెలరీ షాపు ప్రారంభంలో ఎమ్మెల్యే నాయిని

Warangal: వ్యాపారస్తులకు అండగా ఉంటా, ముకుంద జ్యువెలరీ షాపు ప్రారంభంలో ఎమ్మెల్యే నాయిని

కల్తీ లేని నాణ్యమైన..

హనుమకొండ చౌరస్తాలో నూతనంగా ఏర్పటు చేసిన ముకుందా జ్యువలరీ షాపును వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం నగల దుకాణం యజమానులైన నరసింహారెడ్డి, నికితా రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

వ్యాపారాలకు కేరాఫ్ గా హనుమకొండ

వాణిజ్య వ్యాపారాలకు హనుమకొండ నగరం వేదికగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటూ వ్యాపారులు అభివృద్ధి చెందే విధంగా సహకారం అందిస్తున్నామని తెలిపారు. వ్యాపారస్తులు కూడా ప్రజలకు నాణ్యమైన, కల్తీ లేని వస్తువులు సరఫరా చేసి వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

గర్వంగా ఉంది

నికితా రెడ్డి మాట్లాడుతూ ముకుంద జ్యువెలరీ షాపు హనుమకొండలో ప్రారంభించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ప్రజలకు కచ్చితంగా న్యాయం చేకూరే విధంగా తమ వ్యాపారం ఉంటుందని తెలిపారు.

అనంతరం ముకుందా జూవెలరీ యాజమాన్యం ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News