సంక్రాంతి పండుగకు నగరంలో ఉండే ప్రజలందరూ పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంటారు. ఊళ్లకు వెళ్లేటప్పుడు ఇళ్లల్లో డబ్బులు, నగలు పెట్టొద్దని హెచ్చరిస్తుంటారు. అయితే ఓ ఇంటి యాజమాని ఏకంగా దొంగలకే షాక్ ఇస్తూ తలుపు మీద అతికించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -
‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి డోర్‌కు అంటించాడు. దీంతో ఏం ఐడియా రా బాబు.. దొంగలకు లవ్ లెటర్ రాశావంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.