Scream Club Trend: ఇటీవల సోషల్ మీడియా లో కొత్తగా కనిపిస్తున్న ట్రెండ్‌లలో స్క్రిమ్ క్లబ్ ట్రెండ్ (Scream Club Trend) ఒకటి. పేరు వింటే కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది చాలా మందికి మానసికంగా రిలీఫ్ ఇచ్చే ఒక కొత్త పద్ధతి. స్క్రీమ్ క్లబ్ అంటే అరిచేందుకు స్వేచ్ఛ ఇచ్చే క్లబ్బులన్నమాట. ఇదో కొత్త ట్రెండ్. ఒక గ్రూప్‌గా కలిసి గట్టిగా అరవడం. ఇది ఎక్కడైనా ఓపెన్ ప్రదేశంలో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో జరుగుతుంది. ఈ ట్రెండ్‌లో భాగంగా, కొంతమంది కలిసి తమలో ఉన్న టెన్షన్, కోపం, బాధ వంటి భావాలను గట్టిగా అరవడం ద్వారా బయటకు వదులుతారు.
అరిచి గోల చేయండి..
అయితే తమకు పరిచయం లేని కొత్తవాళ్లతో కలిసి గొంతు చించుకుని అరవటమే ఈ ట్రెండ్ లోని ప్రత్యేకత. ఎంతైనా ప్రతి పనికి, ప్రతి వ్యసనానికి క్లబ్బులున్న కాలం కదా ఇది ట్రెండ్ ఫాలో కావటం అంటే. అందుకే అరిచి గోల చేసేందుకు క్లబ్బులు వచ్చేసాయి. మీలోని బాధంతా వెళ్లగక్కేలా ఈ స్క్రీం క్లబ్బుల్లో చేరి మీ టెన్షన్ తీర్చుకోవచ్చు. గతంలో లైఫ్ ఇన్ మెట్రో సినిమాలో ఇలాంటి సీన్లు చూసాం, ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇవి జరుగుతున్నాయి. సప్పర్ క్లబ్, లాఫింగ్ క్లబ్ లాగే ఇది కూడా. పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, మూవింగ్ వెహికల్స్ లో ఇలా అరిచేస్తే బరువెక్కిన మనసు కొంచెం తేలికపడుతుందని నమ్మేవారంతా ఈ ట్రెండ్ ను ట్రై చేస్తున్నారు.
ఎందుకు ట్రెండ్
టెన్షన్ తగ్గించేందుకు.. ఇప్పుడు చాలా మంది పనులు, చదువు, వ్యక్తిగత సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఒక సింపుల్ థెరపి. ఈ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అందుకే చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. మనలో ఉన్న భావాలను బయటకు చెప్పలేకపోతే, గట్టిగా అరవడం ద్వారా కొంత రిలీఫ్ అనిపిస్తుంది.
ప్రయోజనాలు
ఈ స్క్రిమ్ క్లబ్ ట్రెండ్ వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. గట్టిగా అరవడం వల్ల మనలో ఉన్న టెన్షన్ కొంతవరకు తగ్గుతుంది. మనలో దాచుకున్న కోపం, బాధ బయటకు వస్తాయి. ఈ సెషన్ తర్వాత మనసు తేలికగా ఉంటుంది. గ్రూప్ సెషన్, క్లబ్స్ వల్ల ఒక గ్రూప్‌గా చేస్తే వాళ్ల మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది.
Also Read: Micro Mance Trend: అసలేంటి ఈ మైక్రో రొమాన్స్ ట్రెండ్.. రిలేషన్‌షిప్‌లో దీని ప్రభావం ఏంటో తెలుసా?

