Homeట్రేడింగ్Micro Mance Trend: అసలేంటి ఈ మైక్రో రొమాన్స్ ట్రెండ్.. రిలేషన్‌షిప్‌లో దీని ప్రభావం ఏంటో...

Micro Mance Trend: అసలేంటి ఈ మైక్రో రొమాన్స్ ట్రెండ్.. రిలేషన్‌షిప్‌లో దీని ప్రభావం ఏంటో తెలుసా?

Micro Mance Trend: ప్రస్తుతం డేటింగ్, రిలేషన్‌లో ఎన్నో కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా Gen-Z తరం డేటింగ్‌ విషయంలో భిన్నాభిప్రాయాంతో ఉంది. ఇందులో భాగంగా పుట్టికొచ్చినవే బాయ్‌సోబర్‌, మాస్టర్‌డేటింగ్‌ పదాలు. కొద్దిరోజులు ఇవి ఇంటర్నేట్‌ ఫుల్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. వీటితో పాటు డేటింగ్‌, రిలేషన్‌లో మరోకొత్త పదం పుట్టుకొచ్చింది. అదే మైక్రో – మాన్స్ (micro – mance). ప్రస్తుతం ఇది పదం సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతుంది. చిన్న చిన్న యాక్షన్ ద్వారా తమ భాగస్వామిని సంతోష పెట్టడాన్నే మైక్రో – మాన్స్ అని పిలుస్తున్నారు.

- Advertisement -

నిజానికి డేటింగ్‌, రిలేషన్‌లో తమ పార్ట్‌నర్‌ని సంతోషపెట్టడానికి పుట్టిన రోజులు, వాలంటైన్స్‌ డే, పెళ్లి రోజు వంటి స్పెషల్ డేస్‌లో పెద్ద పెద్ద గిఫ్ట్స్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. అయితే సర్‌ప్రైజ్‌లు ఎక్కువకాలం ఉండకపోవచ్చు. అవి వీరి బంధాన్ని బలంగా చేయకపోవచ్చు. కానీ, చిన్న చిన్న యాక్షన్స్‌ మాత్రం ఆ బంధాన్ని బలం చేస్తుంటాయి. అలా తమ రిలేషన్‌ని బలపర్చుకోవడం కోసం ఈ మధ్య యువత మైక్రో – మాన్స్‌ బాగా ఫాలో అవుతుంది. ఇంతకి ఈ మైక్రో – మాన్స్ ట్రెండ్‌ అంటే ఏంటి? ఇది భాగస్వామిని ఎలా హ్యాపీగా ఉంచుతుందో చూద్దాం!

మైక్రో- మాన్స్ అంటే..
ఈ Gen-Z తరంలో ప్రేమ, డేటింగ్‌ సర్వసాధారణంగా మారింది. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల కారణంగా కొత్త వ్యక్తులతో ఈజీగా పరిచయాలు పెంచుకుంటున్నాడు. ప్రేమకు ఇప్పుడు ఇవే కొలమానంగా మారిపోయాయి. ఈ రోజుల్లో ప్రేమ, డేటింగ్ సర్వసాధారణంగా మారిపోయాయి. పాత రోజుల్లో ప్రేమ అంటే ఓ నమ్మకం. స్నేహితులు లేదా బంధువుల సాయంతో కొత్త వ్యక్తుల్ని కలుసుకునేవారు. ప్రేమించే వాళ్లు. ఆ తర్వాత డేటింగ్‌ అంటూ ట్రెండ్ మొదలైంది. ఇక, సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల కారణంగా కొత్త వ్యక్తులతో ఈజీగా పరిచయాలు పెంచుకుంటున్నాడు. ప్రేమకు ఇప్పుడు ఇవే కొలమానంగా మారిపోయాయి.

పార్ట్‌నర్‌ పై ఇలా ప్రేమ చూపించండి
డేటింగ్‌, లవ్‌ అయినా పార్ట్‌నర్స్‌ మధ్య శృంగారం, రొమాన్స్ బంధంలో ప్రేమను వ్యక్తీకరించే మార్గాలు. రొమాన్స్‌లో పెద్ద పెద్ద హావభావాలతో ప్రేమ వ్యక్తపరుస్తారు. అయితే, మైక్రో మాన్స్ ఈ రెండింటికి పూర్తి భిన్నం. ఇందులో పెద్ద పెద్దగా ప్రేమను వ్యక్తపర్చాల్సిన పనిలేదు. చిన్న చిన్న పనులతోనే భాగస్వామిని ఆనందంగా పరచవచ్చు. నిజానికి మైక్రో – మాన్స్ అంటే మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి చిన్న చిన్న మార్గాలను ఫాలో అవ్వడమే. ఉదహరణకు అందమైన కవిత రాయడం, వారికి ఇష్టమైన భోజనం వండటం లేదా వారిని హాగ్ చేసుకోవడం వంటివి. ఇలా చేయడం వల్ల వారిపై మీకు ఎంత ప్రేమ ఉందో మీ పార్ట్‌నర్‌కి వ్యక్తం అవుతుంది. అలాగే “థింకింగ్ ఆఫ్ యు” వంటి మెసేజెస్ చాలా సంతోషాన్ని నింపుతాయి.

చిన్న చాక్లెట్, ఐస్ క్రీం, స్నాక్స్ ప్రేమగా తెచ్చి, సర్ప్రైజ్ చేయచ్చు కూడా. ఇలాంటి చిన్న చేతలే మైక్రో రొమాన్స్ అంటే, అయితే వీటితో బంధంలోని ఆత్మీయత, లోతును పెంచేలా శక్తివంతమైన ప్రభావం చూపుతాయి. పాత జ్ఞాపకాలు నెమరేసుకోవటం, ప్రశంసించటం, థాంక్స్ చెప్పేలాంటి మాటలు-చేతలు ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక వీకెండ్ టైంలో భాగస్వాముల్ని సడెన్‌గా ఆశ్చర్యపర్చండి. భార్యలు.. భర్తలకు నచ్చిన వంటకాలు వండటం, కవితలు రాయడం లాంటివి చేయాలి. అదే భర్తలు అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయడం, పూలతో గదిని అలంకరించడం, సినిమాలకు తీసుకువెళ్లడం, ఏదైనా చిన్న చిన్న ట్రిప్‌లు ప్లాన్ చేయడం లాంటివి చేయాలి. లేదంటే మీ భార్యకి ఇష్టమైన వాటిని గిఫ్ట్‌లుగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల రిలేషన్‌షిప్‌లో ఫ్రెష్‌నెస్ ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News