Saturday, May 25, 2024
Homeట్రేడింగ్World's richest: ప్రపంచంలో అపర కుబేరుడుగా మళ్లీ ఎలాన్ మస్కే

World’s richest: ప్రపంచంలో అపర కుబేరుడుగా మళ్లీ ఎలాన్ మస్కే

ఎలాన్ మస్క్ ఓ పడి లేచే కెరెటం. ఆయనకు ఉత్థాన పతనాలు లెక్కకావన్నట్టుంది తాజా రిపోర్ట్. ప్రపంచంలో అపర కుబేరుడిగా మళ్లీ ఆయనే నిలవటం ఇందుకు మరో ఉదాహరణ. టెస్లా షేర్స్ మరోసారి 100 శాతం పెరగటంతో ఇది సాధ్యమైంది.

- Advertisement -

గతేడాది డిసెంబర్ లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మస్క్ ను తరువాతి స్థానానికి నెట్టేస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచారు. ఫ్రెండ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ సీఈవో బెర్నార్డ్ ఇప్పుడు తన స్థానాన్ని తాజాగా మస్క్ చేతుల్లో పోగొట్టుకున్నారన్నమాట. దీంతో వల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ గా మస్క్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మస్క్ నెట్ వర్త్ అందాజుగా 187.1 బిలియన్ డాలర్లు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకున్నాక రోజుకు 4 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్టు వెల్లడించిన ఆయన ఇప్పటి వరకు 8 రౌండ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News