Electric Scooters: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.వినియోగదారులు పెట్రోల్‌తో నడిచే స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు బదులుగా ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ ఖర్చులను ఆదా చేస్తాయి. అంతేకాదు, వాటి రన్నింగ్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అయితే, ఈరోజు అనగా సెప్టెంబర్ 9 నాడు నేడు ప్రపంచ EV దినోత్సవం. ఈ సందర్భంగా భారతదేశ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Ola S1 Pro Sport
ఓలా S1 ప్రో స్పోర్ట్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 Kwh వరకు బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 242 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 128 కి.మీ.
Also Read: Electric Scooter: రూ.లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా?
TVS iQube ST
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ST. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.59 లక్షలు. ఈ స్కూటర్ 5.3kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌లో 212 కి.మీ. పరిధిని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కి.మీ.
River Indie
రివర్ మొబిలిటీ కూల్ లుకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. రివర్ ఇండిలో 4 Kwh బ్యాటరీ ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌లో 161 కి.మీ ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. రివర్ ఇండి ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.43 లక్షలు.
Simple One
సింపుల్ వన్ భారతదేశంలోని అత్యుత్తమ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.67 లక్షలు. దీనికి 5 Kwh బ్యాటరీ ఉంది. ఇది ఒకే ఛార్జ్‌లో 248 కి.మీ. ప్రయాణిస్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 105 కి.మీ.
Ather 450X
ఏథర్ ఎనర్జీ ప్రీమియం స్కూటర్ ఏథర్ 450X ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుండి రూ. 1.80 లక్షల వరకు ఉంది. దీనికి 3.7 Kwh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 161 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ.


