2025 Yezdi Roadster Launched: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన యెజ్డి, అనేక బైక్‌లను అమ్మకానికి అందుబాటులో ఉంచింది. తయారీదారు యెజ్డి రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్ లో డిజైన్ నుండి ఫీచర్ల వరకు అనేక మార్పులు చేసింది. దీంతో ఈ బైక్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ బైక్‌లో ఎలాంటి ఫీచర్లు అందించారు. ఇంజిన్, ధర వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. యాజ్ది బైక్‌కు 334 సిసి ఆల్ఫా 2 సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇది 28.6 బిహెచ్‌పి పవర్, 30 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. దీనికి ఆరు స్పీడ్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. తయారీదారు ఈ బైక్‌లో కొత్త కౌల్‌తో రౌండ్ LED హెడ్‌లైట్, సన్నని టెయిల్ లైట్లు, డ్యూయల్ టోన్ కలర్, కొత్త పెట్రోల్ ట్యాంక్, తొలగించగల పిలియన్ సీటు, ట్యూబ్‌లెస్ టైర్లు, రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లను కంపెనీ అందించింది. దీనితో పాటు, ఈ బైక్ కు 17, 18 అంగుళాల టైర్లు, 171 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు.
యాజ్ది కొత్త రోడ్‌స్టర్ బైక్ ను ఐదు వేరియంట్లలో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2.10 లక్షలుగా ఉంచారు. దాని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.26 లక్షలు. ఇప్పటికే బైక్ కోసం బుకింగ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్, హోండా CB 350 వంటి బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది.


