7th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. ఏడో వేతన సంఘం త్వరలో చివరి హైక్ ప్రకటించబోతుంది. జూలై నెలకు సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ (DA) మరియు డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపును మోదీ సర్కార్ మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనుంది. ఇది ఈ నెల నుంచే అమల్లోకి రానుంది, కానీ డబ్బు మాత్రం అక్టోబరు నాటికి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. ఈ పెంపు మూలంగా దసరాకు ముందే సుమారు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు లాభపడనున్నారు.
డీఏ ఎంత పెరిగింది?
2016 జనవరిలో ప్రారంభమైన ఏడో పే కమిషన్.. డిసెంబరు 2025లో ముగియనుంది. ఇది దాదాపు 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 66 లక్షల మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. గత ఏడాది మార్చిలో కేంద్రం డీఏను 2శాతం పెంచింది. దీంతో 53%గా ఉన్న డీఏ 55%కి పెరిగింది. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించడానికి డీఏ, డీఆర్ ను ప్రభుత్వం ప్రకటిస్తుంది.
2016లో 7వ వేతన సంఘం ముందు డీఏ ప్రాథమిక వేతనంలో 125%కి చేరుకుంది. ఈ కమిషన్ ముగిసేలోపు డీఏ 60%కి పెరిగితే..కొత్త కమిషన్ ప్రకారం, ఉద్యోగుల జీతాలు దాదాపు 14% పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ గత నాలుగు వేతన కమిషన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే ఈ పెరుగుదల పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా లెక్కిస్తారు.
Also Read: New Rules In August – ఆగస్టు 1 నుండి రాబోతున్న మార్పులు UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలోనే…!
అందరి చూపు దానివైపే..
ఇప్పుడు అందరి చూపు 8వ వేతన సంఘంపైనే ఉంది. ఇది జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు, కానీ దీనికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేపట్టలేదు. ఇప్పటివరకు ఛైర్మన్, సభ్యులను నియమించలేదు. అయితే దీని అమలకు ఏడాదిన్నర నుంచి రెండు సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే కానీ జరిగితే ఉద్యోగుల బకాయిలు మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది.


