8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై మోదీ సర్కార్ కీలక అప్ డేట్ ఇచ్చింది. కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం 2025 జనవరి 16న ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ.. త్వరలో కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై ప్రకటన చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తామనేది క్లారిటీ ఇవ్వలేదు.
ఏడో వేతన కమిషన్ గడువు ఈ ఏడాది డిసెంబరు 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది అందరిలోనూ మెదిలితున్న ప్రశ్న. తాజాగా దీనిపై రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. కమిషన్ ను ఏర్పాటు చేసే ముందు రక్షణ శాఖ, హోం శాఖ వంటి కీలక శాఖలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ విషయంపై చాలా రోజులుగా ఉద్యోగులు నిరాశగా ఉన్నారు. అయితే కేంద్రం తాజా ప్రకటనతో వారిలో నూతన ఉత్సాహం వచ్చింది.
ఎప్పటి నుండి అమలు చేస్తారు?
కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు ఏడో పే కమిషన్ 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేస్తే అది 2015 నవంబరులో రిపోర్టు ఇచ్చింది. దీని సిఫార్సులు 2016 జనవరి నుంచి అమలయ్యాయి. ఈ లెక్కన చూస్తే 8వ వేతన సంఘం రిపోర్టు 2026 చివరిలో గానీ లేదా 2027 మొదట్లోగానీ వచ్చే అవకాశం ఉంది. అంటే కొత్త జీతాలు వచ్చే ఏడాది జనవరి నుంచి పెరిగినా చేతికి అందడానికి కాస్త సమయం పడుతుంది.
Also read: 7th Pay Commission – త్వరలో ఫైనల్ DA ప్రకటన.. భారీగా పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు..
శాలరీలు ఎంత పెరగవచ్చు?
8వ పే కమిషన్ ఏర్పాటుతో ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా ప్రయోజనాలు పొందబోతున్నారు. ప్రస్తుతం రూ.18,000 ఉన్న కనీస శాలరీ ఏకంగా రూ.30,000 నుంచి రూ.41,000 పెరగవచ్చు. అంటే ఈ లెక్కన జీతాలు 20% నుంచి 35% వరకు పెరిగే అవకాశం ఉంది. 2026 నాటికి డీఏ 70 శాతానికి చేరే అవకాశం ఉంది. తాజా పెంపుతో ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.2.4 లక్షల కోట్ల నుంచి రూ.3.2 లక్షల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. ఇది మన దేశ జీడీపీలో 0.6 శాతం నుంచి 0.8 శాతానికి సమానం.


