A massive correction in gold prices: అంతర్జాతీయ పరిణామాలతో గత కొద్ది రోజులుగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలో ఇవాళ (శుక్రవారం) భారీ పెరుగుదల నమోదైంది. పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త శాంతించడంతో బంగారం, వెండి లోహాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో, దేశీయ మార్కెట్‌లోనూ వీటి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,200కు చేరింది. గతంతో పోలిస్తే దాదాపు రూ. 3వేల పైన పెరగడం గమనార్హం. ఇక, కేజీ వెండి రూ.2.49 లక్షలు పలికింది. దీని ధర ఇవాళ (శుక్రవారం) ఒక్క రోజే దాదాపు రూ.9 వేల మేర పెరగడం గమనార్హం.
Also Read: Donald Trump: ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. టారిఫ్‌ల పెంపును సమర్థించిన వాషింగ్టన్ కోర్టు
ఇరాన్‌తో ట్రంప్ డీల్‌తో కోలుకున్న మార్కెట్..
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం ధర 4,205 డాలర్ల మేర పలికింది. గతంతో పోలిస్తే దాదాపు 100 డాలర్ల పైన పెరగడం గమనార్హం. ఇక ఔన్సు వెండి ధర 67.32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1.50 లక్షలు, వెండి ఫ్యూచర్స్ రూ.2.43 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై దాడులు ఆపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పాటు టెహ్రాన్‌తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని చెప్పడంతో మార్కెట్‌కు మంచి జోష్ వచ్చింది. ఈ కారణంతో ఇన్వెస్టర్లు నమ్మకంగా పసిడిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. అటు మన దేశ కరెన్సీ రూపాయి విలువ కూడా భారీగా కోలుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 60 పైసలు బలపడి 95.25 వద్ద ట్రేడ్ అవుతోంది.

