Passes Away:భారతీయ ప్రకటనల ప్రపంచానికి కొత్త నిర్వచనం ఇచ్చిన దిగ్గజం, పద్మశ్రీ పియూష్ పాండే (70) ఇక లేరు. శుక్రవారం ఆయన కన్నుమూయడంతో యాడ్స్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. హాస్యం, మాధుర్యం, భావోద్వేగాలు.. దేనినైనా కేవలం 30 సెకన్ల ప్రకటనలో ఇమిడ్చి, కోట్లాది మంది భారతీయుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేయడంలో ఆయనది అసామాన్య ప్రతిభ.
పియూష్ పాండే సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిన ప్రకటనలు ఎన్నో ఉ) లోని మాధుర్యం, చిన్న చిన్న సంతోషాలను పంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.బుజ్జి కుక్కపిల్ల (పగ్)తో రూపొందించిన వొడాఫోన్ యాడ్స్, టెలికాం రంగంలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ‘హర్ ఖుషీ మే రంగ్ లాయే’లోని రంగుల పట్ల ప్రేమను వ్యక్తం చేశారు.
సామాన్య భారతీయ జీవితంలో, ప్రతిరోజూ మనం చూసే ఎన్నో భావోద్వేగాలను ఆయన పట్టుకుని, వాటిని అద్భుతమైన కథలుగా మలచడంలో సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన ప్రతి ప్రకటన కేవలం వాణిజ్యమే కాదు, భారతీయ జనజీవనంలో ఒక భాగమైపోయింది.వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా, పియూష్ పాండే తన సృజనాత్మకతను రాజకీయ రంగంలోనూ చూపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ఆయన రూపొందించిన చారిత్రాత్మక నినాదం ‘అబ్ కీ బార్, మోదీ సర్కార్’ (Ab Ki Baar, Modi Sarkar) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించింది.
ప్రముఖుల సంతాపం
పియూష్ పాండే మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.”ఆయన ప్రకటనల ప్రపంచంలో ఒక అద్భుతం. ఆయన సృజనాత్మకత కథనాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆయన నిజాయతీ, చమత్కారం ఎంతో ఆకట్టుకునేవి. ఆయన లేని లోటు పూడ్చలేనిది,” అని గోయల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా సంతాపం తెలిపారు.భారత్ ఒక గొప్ప ప్రకటనల మేధావినే కాదు, ఒక నిజమైన దేశభక్తుడిని, గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆయన సన్నిహితుడు సుహేల్ సేఠ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఓగిల్వీకి చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ వరల్డ్‌వైడ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఇండియాగా పాండే అద్భుతమైన సేవలు అందించారు. ప్రకటనల రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2024లో ప్రతిష్ఠాత్మక ఎల్ఐఏ లెజెండ్ అవార్డు కూడా ఆయనకు లభించింది. భారతీయ ప్రకటనల చరిత్రలో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.


