Nepal Travel News: నేపాల్ రాజధాని కాథ్మండు ఎయిర్ పోర్ట్.. త్రిబువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ఆందోళనల వల్ల మూసివేయబడింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా బ్యాన్ ప్రకటించిన తర్వాత మెుదలైన జెన్ జెడ్ అల్లర్లతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రతరం కావటంతో కీలక నేతలు రాజీనామాలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో పరిస్థితులు కంట్రోల్ చేయటానికి అక్కడ తాత్కాలికంగా సైనిక పాలన స్టార్ట్ అయ్యింది.
ఈ పరిస్థితుల దృష్యా.. భారతీయ విమాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో తమ కాథ్మండు-న్యూ ఢిల్లీ మధ్య విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఎయిర్ ఇండియా ఢిల్లీ-కాథ్మండు-డిల్హీ మార్గంలో AI2231/2232, AI2219/2220, AI217/218, AI211/212 వంటి మొత్తం ఆరు విమాన రూట్లు ఆపివేయబడ్డాయి. కొందరు కాథ్మండులోని ఉద్రిక్త పరిస్థితులతో తిరిగి ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదే సమయంలో మరో భారతీయ ఎయిర్ క్యారియర్ ఇండిగో కూడా తన నేపాల్ సర్వీసులను నిలిపేసింది. కాథ్మండు విమానాశ్రయం మూసివేయబడిన నేపథ్యంలో రాకపోకలు ఆపివేయబడ్డాయి. విమానాల రద్దులో ప్రయాణికులు మరోసారి టిక్కెట్లు తీసుకోవచ్చు లేదా ఎండిగో వెబ్‌సైట్ ద్వారా రీఫండ్ పొందవచ్చని ప్రకటించింది సంస్థ.
ప్రస్తుత పరిస్థితుల్లో విమానాశ్రయ భద్రత కీలకంగా పరిగణిస్తున్నాయి కంపెనీలు. ఈ కారణంగా చాలా మంది ప్రయాణికులు ముఖ్యంగా భారత్-నేపాల్ మద్ధతుదారులు, సాహసయాత్రికులు ఈ విమానాల నిలిపివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో పరిస్థితులకు అనుగుణంగా త్వరలో విమాన సేవలు పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి కొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలో నేపాల్ ఎయిర్లైన్స్ కూడా కొన్ని సేవలను నిలిపివేశాయి. ఈ నిర్ణయాలు ప్రయాణికుల భద్రత కోసం తీసుకోబడ్డాయని ఎయిర్ ఇండియా, ఇండిగో అధికారిక ప్రకటనల ప్రకారం తెలుస్తోంది.


