Saturday, November 15, 2025
HomeTop StoriesSME IPO: ఒక్క రోజులో డబ్బులు డబుల్ చేసిన ఐపీఓ.. మీరూ బెట్ వేశారా..

SME IPO: ఒక్క రోజులో డబ్బులు డబుల్ చేసిన ఐపీఓ.. మీరూ బెట్ వేశారా..

Airfloa Rail Technology IPO: ఐపీఓ ద్వారా పెట్టుబడి పెట్టినవారికి ఒక్కరోజులోనే డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాన్ని ఇచ్చింది ఎయిర్‌ఫ్లో రైలు టెక్నాలజీ. ఈ కంపెనీ షేర్లు 140 రూపాయల ఇష్యూ ధరలో రాగా స్టాక్ ఎక్స్చేంజీల్లో 90 శాతం ప్రీమియం రేటు 266 రూపాయల వద్ద లిస్టయ్యాయి. మొదటి రోజు ఈ షేర్లు 5 శాతం అప్పర్ సర్కిట్ కూడా వేసింది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే ఈ షేర్ల విలువ 99.5 శాతం పెరిగి మెుదటి రోజే పెట్టుబడిదారులకు డబుల్ రిటర్న్ ఇచ్చింది.

- Advertisement -

ఈ ఐపీఓ 11 సెప్టెంబర్ ప్రారంభమై 15 సెప్టెంబర్ నాటికి ముగిసింది. రిటైల్ ఇన్వెస్టర్లు 330 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 350 రెట్లు, ఆర్ఎస్‌ఐ బ్యాలెన్స్ కూడా అత్యధికంగా సబ్ స్ర్కైబ్ అయ్యాయి. మెుత్తానికి ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో తొలిరోజు లాభాలతో రచ్చ చేసింది. దీనిపై బెట్టింగ్ వేసి షేర్లు పొందిన ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు.

కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే.. రైల్వే రోలింగ్ స్టాక్ కాంపోనెంట్స్, టర్న్‌కీ ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ వంటి ముఖ్యమైన ప్రాజెక్ట్స్ లో పని చేస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఆగ్రా-కాన్పూర్ మెట్రో, RRTRS, విస్టాడోమ్ కోచ్ లాంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు కూడా కంపెనీ తన సేవలు అందిస్తోంది. 2025 ఆర్థిక వర్షంలో ఈ కంపెనీ 192.7 కోట్ల రూపాయల ఆదాయం, 25.6 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

ప్రస్తుతం కంపెనీ ఐపీఓ నుండి సేకరించిన డబ్బులో 13.7 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రూ.6 కోట్ల రుణాల చెల్లింపు, 59.3 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించాలని డిసైడ్ అయ్యింది. ఈ ఐపీఓలో పెట్టుబడి చేసిన వారు ఒక్క రోజులోనే తమ పెట్టుబడిని రెట్టింపు చేసుకోవడమంటే సంచలనమే. సుదీర్ఘ ప్రాజెక్ట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థ సంస్థకు అద్భుతమైన మార్కెట్ విశ్వాసాన్నిస్తూ, ఈ ఐపీఓను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad