Thursday, January 22, 2026
Homeబిజినెస్Airtel Postpaid Plans: అదిరిపోయే బెనిఫిట్స్‌తో ఎయిర్‌టెల్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లు.. ప్రయోజనాలు ఇవే..!

Airtel Postpaid Plans: అదిరిపోయే బెనిఫిట్స్‌తో ఎయిర్‌టెల్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లు.. ప్రయోజనాలు ఇవే..!

Airtel Best Postpaid Plans and Benefits: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌ టెల్ అద్భుతమైన పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లు అన్‌ లిమిటెడ్ కాలింగ్, డేటా రోలోవర్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ లాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్లాన్ల ధర రూ. 449 నుంచి ప్రారంభమై రూ. 1,749 వరకు ఉంటుంది. ఎయిర్‌ టెల్ 5జీ ప్లస్‌తో అన్‌లిమిటెడ్ డేటా స్పీడ్ లభిస్తుంది. బెస్ట్ ప్లాన్ మీ డేటా, ఫ్యామిలీ సైజు, ఎంటర్‌ టైన్‌మెంట్ బెనిఫిట్స్‌తో వస్తుంది.

- Advertisement -

ఎయిర్ టెల్ బెస్ట్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్..

రూ. 449 ప్లాన్

ఈ ప్లాన్‌ 50 జీబీ డేటా రోలోవర్‌తో వస్తుంది. 1 ఉచిత సిమ్ అందిస్తుంది. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, గూగుల్‌ వన్‌ (100 జీబీ క్లౌడ్), పర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్‌ లాంటి ప్రయోజనాలను అందిస్తుంది. సింగిల్ యూజర్లకు బేసిక్ డేటా, ఓటీటీ వంటి అన్ని అవసరాలకు సరిపోతుంది.

రూ. 599 ప్లాన్

ఈ ప్లాన్‌ 75 జీబీ డేటా రోలోవర్‌తో వస్తుంది. 1 ఉచిత సిమ్ లభిస్తుంది. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, అమెజాన్‌ ప్రైమ్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, గూగుల్‌ వన్‌ (100 జీబీ), పర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్, అపోలో 24/7 సర్కిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. మీడియం డేటా, స్ట్రీమింగ్ లవర్స్‌ కు ఇది బెస్ట్‌ ప్లాన్‌గా చెప్పవచ్చు.

రూ. 999 ప్లాన్

ఈ ప్లాన్‌ 105 జీబీ డేటా రోలోవర్‌తో వస్తుంది. దీనిలో 2 ఉచిత సిమ్‌లు లభిస్తాయి. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, అమెజాన్‌ ప్రైమ్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టర్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్, గూగుల్‌ వన్‌ (100 జీబీ), పర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్‌, అపోలో 24/7 సర్కిల్‌ ప్రయోజనాలను అందిస్తుంది. నలుగురు సభ్యులు ఉండే కుటుంబాలకు ఇది బెస్ట్‌ ప్లాన్‌గా చెప్పవచ్చు.

రూ.1199 ప్లాన్
ఈ ప్లాన్‌ కింద 150 జీబీ డేటా లభిస్తుంది. 3 ఉచిత సిమ్ కార్డులు లభిస్తాయి. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, అమెజాన్‌ ప్రైమ్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్, యాపిల్‌ టీవీ ప్లస్‌, యాపిల్‌ మ్యూజిక్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టర్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్, గూగుల్‌ వన్‌ (100 జీబీ), పర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్‌, అపోలో 24/7 సర్కిల్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఐదుగురు కుటుంబ సభ్యులకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

రూ.1749 ప్లాన్
ఈ ప్లాన్‌ కింద 240 జీబీ డేటా లభిస్తుంది. 4 ఉచిత సిమ్ లు అందిస్తారు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, నెట్‌ఫ్లిక్స్‌ (ప్రీమియం), అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టర్‌, యాపిల్‌ మ్యూజిక్‌/టీఈ ప్లస్‌, గూగుల్‌ వన్‌ (100 జీబీ), పర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్, అపోలో 24/7 సర్కిల్‌, ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. హైఎండ్ యూజర్స్, పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News