Airtel Family Plan: భారత టెలికాం రంగంలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ Bharti Airtel. కాలింగ్ క్వాలిటీ, నెట్‌వర్క్ స్పీడ్, దేశవ్యాప్తంగా కవరేజ్… ఈ మూడు విషయాల్లో ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ లుక్‌తో ముందుకు వెళ్తూనే ఉంటుంది. కస్టమర్ల అవసరాలు ఎలా మారుతున్నాయో గమనిస్తూ, వాటికి తగ్గట్టుగా కొత్త ప్లాన్‌లు తీసుకురావడం ఎయిర్‌టెల్ స్టైల్. ముఖ్యంగా ఫ్యామిలీ యూజర్ల కోసం ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్‌నే ఈ ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్.
ప్లాన్ ధర రూ.699 మాత్రమే
ఇందులో 2 SIMలు ఇస్తున్నారు, పైగా రెండింటికీ కలిపి మొత్తం 105GB షేర్‌డ్ డేటా. రోజూ ఇంత డేటా అనే పరిమితి లేదు, నెల మొత్తం అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ అన్ని నెట్‌వర్క్‌లకి ఫ్రీగా వస్తుంది. ఇంట్లో ఇద్దరూ ఒకే డేటా పూల్ నుంచి వాడుకోవడం వల్ల ఎవరికెంత కావాలన్నా మీరు మీరే మేనేజ్ చేసుకోవచ్చు.
Read Also: iPhone 17 deal: ప్రేమికుల రోజున అదిరిపోయే ఆఫర్.. ఐఫోన్ 17పై ఊహించని డిస్కౌంట్.. క్రోమాలో మాత్రమే
ఫ్రీ OTT బెనిఫిట్స్
ఇంకా పెద్ద ఆకర్షణ ఫ్రీ OTT బెనిఫిట్స్. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు అదనపు ఖర్చు లేకుండా చూసే అవకాశం ఈ ప్లాన్‌తో వస్తుంది. సాధారణంగా ఇవన్నీ వేరుగా తీసుకుంటే నెలకి మంచి మొత్తం ఖర్చవుతుంది. కానీ ఇక్కడ అదే ఎంటర్‌టైన్‌మెంట్ రూ.699లోనే కలిసిపోతుంది. Airtel యాప్ ద్వారా డేటా యూజేజ్ చెక్ చేయడం, టాప్‌అప్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ఎవరికి ఉపయోగం
భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు, పేరెంట్-చైల్డ్ లాంటి చిన్న ఫ్యామిలీలకి ఇది బాగా ఉపయోగపడే డీల్. విడివిడిగా రెండు రీచార్జ్‌లు చేస్తే రూ.800కి పైగా అవుతుంది, పైగా OTT ఖర్చు అదనం. అదే ఇక్కడ రూ.699కే 2 SIMలు, 105GB డేటా, కాలింగ్ ఫ్రీ, ఎంటర్‌టైన్‌మెంట్ బోనస్ అన్నీ కలిపి వస్తున్నాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ వాల్యూ కావాలనుకునే ఫ్యామిలీ యూజర్లకి ఈ ఎయిర్‌టెల్ ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ నిజంగా ఒక స్ట్రాంగ్ ఆప్షన్.

