Saturday, March 14, 2026
Homeబిజినెస్Amazfit active 3 premium: 12 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్.. ఫిట్‌నెస్ ప్రేమికులకు పర్‌ఫెక్ట్...

Amazfit active 3 premium: 12 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్.. ఫిట్‌నెస్ ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్

Amazfit active 3 premium: ఫిట్‌నెస్ ట్రాకింగ్ లో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమేజ్‌ఫిట్ ఇప్పుడు యాక్టివ్ 3 ప్రీమియం పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్ ను పరిచయం చేసింది. రోడ్ రన్నింగ్, జిమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్టూడియో వర్కౌట్స్ చేసే వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ వాచ్‌ను తయారు చేశారు. కాంపాక్ట్ సైజ్, ప్రీమియం మెటల్ ఫ్రేమ్, తగినంత ఫిట్‌నెస్ ఫీచర్స్ కలయికగా ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది.

- Advertisement -

డిస్‌ప్లే లో హై బ్రైట్నెస్ 

ఈ వాచ్‌లో 1.32 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 466×466 రిజల్యూషన్, 353 పిపిఐ క్లారిటీతో స్క్రీన్ చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. సాఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల స్క్రాచెస్ వచ్చే అవకాశాలు తక్కువ. ప్రీమియం లుక్ కావాలనుకునే వాళ్లకు ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.

స్టోరేజ్, కనెక్టివిటీ  

4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. ఇందులో మ్యూజిక్, ఆఫ్‌లైన్ మ్యాప్స్ సేవ్ చేసుకోవచ్చు. జెప్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ 7.0 పైగా, ఐఓఎస్ 14.0 పైగా ఉన్న ఫోన్లతో ఈ వాచ్ కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో పాటు కాలింగ్ కోసం బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్ ఉన్నాయి. డైలీ నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్ అప్డేట్స్, సెడెంటరీ అలర్ట్స్ లాంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

Read Also: Tecno Pova Curve 2 review: భారీ బ్యాటరీ కావాలా? అయితే ఈ ఫోన్ మీ కోసమే.. టెక్నో పోవా కర్వ్ 2 రివ్యూ.

హెల్త్ ట్రాకింగ్ – 24 గంటల మానిటరింగ్

బయోట్రాకర్ PPG సెన్సర్ ద్వారా 24 గంటల హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్ట్రెస్ లెవెల్స్, స్కిన్ టెంపరేచర్, స్లీప్ ట్రాకింగ్ చేస్తుంది. పీఏఐ హెల్త్ స్కోర్ ద్వారా మీ ఫిట్‌నెస్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్, మహిళల కోసం సైకిల్ ట్రాకింగ్, రికవరీ ఇన్‌సైట్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. రోజువారీ ఆరోగ్యంపై దృష్టి పెట్టేవాళ్లకు ఇది ఉపయోగపడుతుంది.

170కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ – ప్రొ లెవెల్ డేటా

170 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ చేయడం ఈ వాచ్ ప్రత్యేకత. కొన్ని వర్కౌట్స్ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. బిల్ట్ ఇన్ రన్నింగ్ ప్రోగ్రామ్స్, అడాప్టివ్ ట్రైనింగ్ ప్లాన్స్, లాక్టేట్ థ్రెషోల్డ్ అనాలిసిస్, రన్నింగ్ పవర్, గ్రౌండ్ కాంటాక్ట్ టైమ్ ట్రాకింగ్, పోస్చర్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ రన్నర్స్ కి కూడా ఉపయోగపడే విధంగా ఈ డేటా ఉంటుంది.

జిపిఎస్, ఆఫ్‌లైన్ మ్యాప్స్ – అవుట్‌డోర్ యాక్టివిటీస్ కు బెస్ట్

6 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్స్ సపోర్ట్ ఉండటం వల్ల ట్రాకింగ్ యాక్యురసీ మెరుగ్గా ఉంటుంది. ఆఫ్‌లైన్ మ్యాప్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఆటోమేటిక్ రీ రూటింగ్ వంటి ఫీచర్స్ అవుట్‌డోర్ రన్నింగ్, సైక్లింగ్ సమయంలో ఉపయోగపడతాయి. స్ట్రావా, గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ వంటి యాప్స్ తో డేటా సింక్ చేయవచ్చు.

బ్యాటరీ – 12 రోజులు వరకు బ్యాకప్

ఈ వాచ్ లో 365mAh బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో 12 రోజులు వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. హెవీ యూజ్ లో 7 రోజులు, కంటిన్యూస్ జిపిఎస్ లో 24 గంటలు పనిచేస్తుంది. 45mm స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, 38 గ్రాముల వెయిట్ తో చేతికి లైట్ ఫీల్ ఇస్తుంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల స్విమ్మింగ్ సమయంలో కూడా వాడుకోవచ్చు.

ధర, అందుబాటు

ఈ స్మార్ట్‌వాచ్ ధర 169.99 డాలర్లు, అంటే సుమారు 15,500 రూపాయల రేంజ్. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. ఏపెక్స్ సిల్వర్, అట్లాస్ బ్లూ, ఏరో వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. రన్నింగ్ పై ఫోకస్ పెట్టిన వాళ్లకు, హై బ్రైట్నెస్ డిస్‌ప్లే, తగినంత బ్యాటరీ, అడ్వాన్స్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ కావాలనుకునే వారికి అమేజ్‌ఫిట్ యాక్టివ్ 3 ప్రీమియం మంచి ఎంపికగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News