Amazon ‘Add to Delivery’: వినియోగదారుల కోసం ప్రముఖ ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ చేయడం మరింత సులభం కానుంది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటి.. ఆ విశేషాలేంటి.. ఇక్కడ చూద్దాం..
Also Read: https://teluguprabha.net/telangana-news/plan-b-for-tg-local-body-elections/
ప్రస్తుతం దసరా, దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. ఈ సీజన్‌లో భారీ డిస్కౌంట్‌లు కల్పిస్తుండటంతో మిలియన్ల కొద్దీ ఆర్డర్లు జనరేట్ అవుతుంటాయి. అయితే సాధారణంగా కొన్ని ప్రొడక్టులను కార్ట్‌లో యాడ్ చేసి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత.. వేరే వస్తువు కూడా కొనాలనుకుంటే మళ్లీ కొత్తగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా టైం ఎక్కువ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్.. ‘యాడ్ టు డెలివరీ’ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
‘యాడ్ టు డెలివరీ’ ఫీచర్ ద్వారా కస్టమర్లు ఇప్పటికే ఆర్డర్ పెట్టిన వస్తువులకు జతగా మీరు కొనాలనుకున్న మరో ప్రొడక్టును కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మళ్లీ అడ్రెస్ లాంటి వివరాలు అందించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా చివరి నిమిషంలో కస్టమర్లు ఇబ్బంది పడకుండా తమకు కావాల్సిన ప్రొడక్టులను ఆర్డర్‌కు యాడ్ చేసుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది.


