Homeబిజినెస్Amazon Robotics: 5 లక్షల ఉద్యోగాల స్థానంలో రోబోలు.. కార్మికుల వ్యతిరేకతను తగ్గించేందుకు అమెజాన్ రహస్య...

Amazon Robotics: 5 లక్షల ఉద్యోగాల స్థానంలో రోబోలు.. కార్మికుల వ్యతిరేకతను తగ్గించేందుకు అమెజాన్ రహస్య ప్లాన్!

Amazon To Replace 5 Lakh Jobs With Robots: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ తమ సంస్థలో రాబోయే కాలంలో 5 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను రోబోలు, ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైంది.

- Advertisement -

న్యూయార్క్ టైమ్స్ యాక్సెస్ చేసిన అంతర్గత పత్రాల ప్రకారం, అమెజాన్ రోబోటిక్స్ బృందం లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది: 2033 నాటికి తమ కార్యకలాపాలలో 75 శాతం ఆటోమేషన్ ద్వారా నిర్వహించాలి. తద్వారా వేర్‌హౌస్‌లలో మానవ కార్మికుల సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పదాలు మార్చాలని ప్లాన్

ఉద్యోగుల నుంచి, సామాజికంగా వ్యతిరేకత రాకుండా ఉండటానికి అమెజాన్ జాగ్రత్త పడుతున్నట్లు ఈ పత్రాలు చెబుతున్నాయి. ఈ పత్రాలలో, ఉద్యోగుల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు, సంస్థ “ఆటోమేషన్”, “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” వంటి పదాలకు బదులుగా “అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ” (అధునాతన సాంకేతికత) అనే పదాన్ని ఉపయోగించాలని సూచించింది. అంతేకాకుండా, “రోబోలు” అనే పదానికి బదులు మనుషులు, రోబోల కలయికను సూచించే “కోబోట్స్” (Cobots – Collaboration of humans and robots) అనే పదాన్ని ఉపయోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం దాదాపు 1.2 మిలియన్ల మంది ఉద్యోగులను కలిగి ఉన్న అమెజాన్, ఆటోమేషన్ ద్వారా 2033 నాటికి అదనంగా అవసరమయ్యే 6 లక్షల మందిని నియామకం చేయకుండా నిరోధించాలని భావిస్తోంది.

ALSO READ: Eox Oko Electric Scooter: రూ.35,800కే ఎలక్ట్రిక్ స్కూటర్..60కిమీ మైలేజ్..ఇప్పుడే బుక్ చేసుకోండి!

భారీగా డబ్బు ఆదా

ఈ రోబోట్ ఆటోమేషన్ ద్వారా, కంపెనీకి ప్యాకేజింగ్, డెలివరీ చేసే ప్రతి వస్తువుపై సుమారు 30 సెంట్లు (రూ. 26) ఆదా అవుతుందని అంచనా. 2027 నాటికి, అమెరికాలో అదనంగా అవసరమయ్యే 1,60,000 మంది నియామకాన్ని నివారించవచ్చని ఆటోమేషన్ బృందం అంచనా వేసింది.

అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ స్పందిస్తూ, ఈ పత్రాలు సంస్థలోని ఒక బృందం యొక్క అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయని తెలిపారు. రాబోయే హాలిడే సీజన్ కోసం తాము 2,50,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన ఉంటాయా లేక శాశ్వతమా అనేదానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

అమెజాన్ 2012లో రోబోటిక్స్ తయారీ సంస్థ కివాను 775 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా రోబోటిక్ ఆటోమేషన్‌లోకి తొలి అడుగు వేసింది.

ALSO READ: Satya Nadella Salary: శాలరీ రూ.847 కోట్లా.. వామ్మో సత్య నాదెళ్ల అమెరికాలోనే హై పెయిడ్ సీఈవోనా..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News