Saturday, November 15, 2025
Homeబిజినెస్US Tariffs: అమెరికా నుంచి టారిఫ్స్ నోటీసులు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్, ప్రభావం ఇదే..

US Tariffs: అమెరికా నుంచి టారిఫ్స్ నోటీసులు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్, ప్రభావం ఇదే..

Stock Markets Crash: అమెరికా ప్రభుత్వం 2025 ఆగస్టు 27 నుంచి భారతీయ దిగుమతులపై అదనంగా 25% టారిఫ్ విధించనున్నట్లు అధికారికంగా నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల అమెరికా దిగుమతుల్లో భారత వస్తువులపై మొత్తం సుంకం 50%కి చేరనుంది. రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డొనాల్ట్ ట్రంప్ తాజా చర్యలు వచ్చాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ వార్తలతో నేడు భారతీయ స్టాక్ మార్కెట్లలో కల్లోలం కొనసాగుతోంది. కీలక బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగుతున్నాయి.

- Advertisement -

అమెరికా ప్రభుత్వం ఈ టారిఫ్ నోటీసును ‘రష్యా ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రమాదాలకు స్పందన’గా వెల్లడించింది. భారత్-అమెరికా మధ్య గత కొంత కాలంగా వాణిజ్య ఒప్పందాలు సున్నితంగా మారాయి. త్వరలో ఏమి జరుగుతుందన్న స్పష్టత లేకపోవడంతో భారత ప్రభుత్వం కూడా స్థిరమైన చర్యలు తీసుకుంటుంద‌ని ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి ఎక్కువ సుంకాలు వేయడంతో భారత్-అమెరికా వాణిజ్య బంధానికి భారీ దెబ్బ పడే అవకాశం ఉంది.

భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఇదే..
* అమెరికా టారిఫ్ పెంపు వార్త వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అతిపెద్ద ఎగుమతి రంగాల్లో, ముఖ్యంగా ఐటీ, టెక్స్టైల్, ఫార్మా, ఆటో రంగాల్లో నష్టాలు నమోదు కావచ్చు.
* తీవ్రంగా ప్రభావితమయ్యే కంపెనీల షేర్లు ఇప్పుడే ప్రెషర్ ఎదుర్కుంటున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ రానున్న కాలంలో కూడా నెగెటివ్‌గా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* అంతర్జాతీయ వాణిజ్యంలో నిషేధాలు పెరిగితే భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు నెమ్మదించాయి. విదేశీ మదుపరులు వేచిచూసే ధోరణిని కొనసాగిస్తున్నాయి. తద్వారా మార్కెట్‌లో మందగమనం, అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది.

భారత ప్రభుత్వ స్పందన..
ప్రభుత్వం తక్షణంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా దానిపై పర్యవేక్షణ, స్పందన చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ “ఎంతో ఒత్తిడి వచ్చినా, దేశ ఆత్మనిర్భరత ఉద్ధరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని” వ్యాఖ్యానించారు. ఆగస్టు 27 నుంచి భారతదేశంపై ట్రంప్ కొత్త టారిఫ్స్ 25 శాతంతో కలిపి 50 శాతం అమలులోకి రానున్నట్లు నోటీసులు వచ్చిన వేళ మార్కెట్లు కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad