Ampere Magnus Neo Electric Scooter Offers on Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా సేల్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రీమియం రేంజ్‌లో లభించే ఆంపియర్ మాగ్నస్ ఈవీ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,999 ధర ఉండే ఆంపియర్ మాగ్నస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఏకంగా రూ. 20 వేల భారీ డిస్కౌంట్
ప్రస్తుతం ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 89,999 ధర వద్ద లభిస్తోంది. అయితే, ఈ స్కూటర్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా మీరు కేవలం రూ.70 వేల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా 9 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అదనపు డిస్కౌంట్‌ను సైతం పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే మీకు అదనంగా రూ.11,250 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉంది. అంటే, రూ.20 వేల తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే రూ.7 వేల వరకు డిస్కౌంట్‌పై దీన్ని కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, భీమ్ యాప్, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చేసే చెల్లింపులపై ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ఆంపియర్ మాగ్నస్ నియో ఈ-స్కూటర్ ఫీచర్లు ఇవే..
మ్యాగ్నస్ నియోను ప్రీమియం డ్యుయల్ టోన్ ఫినిష్‌తో తీర్చిదిద్దారు. మెటాలిక్ రెడ్, గ్రేషియల్ వైట్, ఓషియన్ బ్లూ, గ్యాలక్టిక్ గ్రే, గ్లాసీ బ్లాక్ వంటి ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. 65 km/h అత్యధిక వేగం వద్ద ఈ స్కూటర్ గరిష్ఠ పవర్, టార్క్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ట్యూబ్‌లెస్ టైర్లతో12 అంగుళాల అలాయ్ వీల్స్‌ను ఇచ్చినట్లు వెల్లడించింది. మ్యాగ్నస్ నియోతో ఐదేళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తున్నట్లు GEML వెల్లడించింది. కస్టమర్ల భద్రత దృష్ట్యా అత్యంత సురక్షితమైన 2.3kWh ‘లిథియం ఐరన్ పాస్ఫేట్’ బ్యాటరీని ఇందులో అమర్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రివర్స్‌తో పాటు మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మ్యాగ్నస్ నియోలో ఎల్‌ఈడీ లైటింగ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కూడిన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో ఫైండ్ మై స్కూటర్, లైవ్ ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటీ ఫీచర్లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్‌తో పాటు డ్యుయల్ షాక్ అబ్జర్బర్స్‌ను సైతం ఇచ్చారు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన డ్రమ్ బ్రేక్స్‌ను అమర్చారు. ఈ కొత్త స్కూటర్ మార్కెట్‌లో ఓలా ఎస్1 ఎక్స్, జెలియో ఈవా జెడ్‌ఎక్స్+, హీరో ఎలక్ట్రిక్ ఆట్రాయాతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ పడనుంది.


