Sunday, November 16, 2025
Homeబిజినెస్Amul Milk: పాల ప్యాకెట్ రేట్లు తగ్గవన్న అమూల్.. జీఎస్టీ మార్పులతో నో ఛేంజ్..

Amul Milk: పాల ప్యాకెట్ రేట్లు తగ్గవన్న అమూల్.. జీఎస్టీ మార్పులతో నో ఛేంజ్..

Amul on Milk Rates: దేశీయ పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్ జీఎస్టీ రేట్ల మార్పులతో తమ పాల ప్యాకెట్ రేట్లు తగ్గడం లేదని క్లారిటీ ఇచ్చింది. పాల ప్యాకెట్లపై ఇప్పటికే జీఎస్టీ సున్నా శాతం ఉండటంతో కొత్త జీఎస్టీ స్లాబ్స్ వచ్చినప్పటికీ రేట్లలో ఎలాంటి మార్పురాదని ప్రకటించింది. అయితే కేవలం అల్ట్రా హై టెంపరేచర్ ప్రాసెస్డ్(UHT) పాలు మాత్రం జీఎస్టీ నుండి పూర్తిగా మినహాయించబడ్డాయని.. అందువల్ల వాటి రేట్లు సెప్టెంబర్ 22 నుండి తగ్గిస్తున్నట్లు చెప్పింది. గతంలో ఈ యూహెచ్ టి పాలపై 5 శాతం జీఎస్టీ రేటు ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అమూల్ వెల్లడించిన వివరాలు:
పాల ప్యాకెట్లపై ఎప్పటి నుండో జీఎస్టీ సున్నా శాతంగా ఉంది. అందుచేత కొత్త జీఎస్టీ మార్పులు వాటిపై ప్రభావం చూపబోవని రేట్లు తగ్గుతాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిఫై చేసింది. కేవలం వచ్చిన మార్పల్లా UHT పాలు పై పాత జీఎస్టీ 5% నుంచి ఇప్పుడు సున్నా శాతానికి తగ్గటం. సెప్టెంబర్ 22 నుంచి UHT పాలు తక్కువ రేట్లతో మార్కెట్లో వస్తాయి. సాధారణ ప్యాకెట్ పాలు, గేదె ఆవు పాలు తదితరాలు జీఎస్టీ రహితంగా ఉండటంతో రేట్లు ఇప్పటికీ చేంజ్ కావు. మెుత్తానికి అమూల్ పాల ప్యాకెట్ రేట్లు జీఎస్టీ మార్పులతో తగ్గడం లేదన్నమాట.

UHT పాలు అంటే ఏంటి..
UHT పాలును చాలా అధిక ఉష్ణోగ్రత (సుమారు 135°C నుంచి 150°C వరకు) కొన్ని సెకన్లలో వేడి చేసి వెంటనే చల్లార్చాలి. ఈ ప్రక్రియ ద్వారా పాలలో ఉండే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను నాశనం చేస్తారు. దాంతో పాలకు షెల్ఫ్ లైఫ్ చాలా పెరుగుతుంది. ఫ్రిజ్ లేకుండా కూడా వీటిని స్టోర్ చేసి ఉపయోగించుకోవచ్చు. వీటిని తమకు స్థానికంగా తక్కువ హైజీన్ లేదా ఫ్రిజ్ సౌకర్యాలు లేనివారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad