Wednesday, July 16, 2025
Homeబిజినెస్Reliance Group: అనంత్ అంబానీ లెవెలే వేరు.. వార్షిక వేతనం రూ.20 కోట్లు..

Reliance Group: అనంత్ అంబానీ లెవెలే వేరు.. వార్షిక వేతనం రూ.20 కోట్లు..

Anant Ambani Annual Salary: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వేతనం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. అతను కొత్త బాధ్యతలు చేపట్టినప్పటి కంపెనీ లాభాల నుండి అక్షరాల రూ. 10 కోట్ల నుండి 20 కోట్ల వరకు వార్షిక వేతనం అందుకుంటున్నాడు. దీనిలో వివిధ భత్యాలు మరియు కమిషన్‌ ఉంటాయి. అనంత్ ఇటీవల కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అతని ఇల్లు, ప్రయాణం, వైద్యం, భద్రత మరియు కుటుంబంతో సహా ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌తో సహా అనేక సౌకర్యాలను పొందుతారని రిలయన్స్ వాటాదారులకు పంపిన నోటీసులో తెలియజేసింది. దీనితో పాటు వ్యాపార పర్యటనల సమయంలో ప్రయాణ ఖర్చులు, భార్య మరియు సహాయకులతో బస ఖర్చులను కూడా కంపెనీ భరిస్తుంది.

- Advertisement -

గతంలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

2023లో ముఖేష్ అంబానీ తన ముగ్గురు పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్‌లను కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేర్చుకున్నామని ప్రకటించారు. అప్పుడు అతనికి ఎటువంటి జీతం రాలేదు, సమావేశానికి హాజరైనందుకు రూ. 4 లక్షల రుసుము మాత్రమే, లాభాలపై దాదాపు రూ. 97 లక్షల కమీషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన తర్వాత, 30 ఏళ్ల అనంత్‌కు పూర్తి జీతం లభిస్తుంది. అనంత్ అంబానీకి ఆయిల్-టు-కెమికల్, న్యూ ఎనర్జీ, వినైల్, స్పెషాలిటీ పాలిస్టర్ మరియు గిగాఫ్యాక్టరీస్ వంటి ప్రాజెక్టుల బాధ్యతను తనకు అప్పగించినట్లు రిలయన్స్ తెలిపింది.

పదేళ్లుగా రిలయన్స్ గ్రూప్‌తో అనుబంధం

అనంత్ 2015 నుండి రిలయన్స్ గ్రూప్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. కంపెనీ ఇంధన వ్యాపారంలో, ముఖ్యంగా సౌర, పునరుత్పాదక ప్రాజెక్టులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అతను రిలయన్స్ ఫౌండేషన్ మరియు వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంటారాతో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు.

నెక్ట్స్ జనరేషన్ ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది

రిలయన్స్ వారసత్వ ప్రణాళిక ప్రకారం, ముగ్గురు అంబానీ పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్‌లకు వేర్వేరు వ్యాపార యూనిట్ల బాధ్యతను అప్పగించారు. ఆకాష్ అంబానీ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ మరియు ఈ-కామర్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు, అనంత్ అంబానీ ఇంధన మరియు రసాయన వ్యాపారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News