Thursday, March 12, 2026
Homeబిజినెస్Apple AI Pin: డిస్ప్లే లేకుండానే ఐఫోన్? అతిపెద్ద మార్పుకు సిద్ధమైన యాపిల్

Apple AI Pin: డిస్ప్లే లేకుండానే ఐఫోన్? అతిపెద్ద మార్పుకు సిద్ధమైన యాపిల్

Apple Screenless Future: స్మార్ట్‌ఫోన్ అంటే చేతిలో ఇమిడిపోయే ఒక స్క్రీన్.. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన నిర్వచనం. కానీ, టెక్ దిగ్గజం యాపిల్ ఈ నిర్వచనాన్ని మార్చేయబోతోంది. స్క్రీన్ అవసరం లేని, కేవలం మన మాటలతోనే మాయ చేసే ఒక AI పిన్‌ను తీసుకువచ్చేందుకు యాపిల్ సిద్ధమవుతున్నట్లు టెక్ ప్రపంచంలో గట్టిగా వినిపిస్తోంది.

- Advertisement -

స్మార్ట్‌ఫోన్‌ను జేబులో నుంచి తీయకుండా, స్క్రీన్‌ను స్క్రోల్ చేయకుండా.. కేవలం వాయిస్ కమాండ్స్‌తో పనులు చక్కబెట్టే పరికరమే ఈ AI పిన్. ఇందులో కెమెరా, మైక్రోఫోన్ , పవర్‌ఫుల్ AI ప్రాసెసింగ్ ఉంటాయి. మీరు రోడ్డుపై వెళ్తూ ఏదైనా షాపును చూస్తే, ఆ షాపు వివరాలను AI మీకు చెబుతుంది. మీరు ఏదైనా అడిగితే, తక్షణమే సమాధానం ఇస్తుంది. అంటే మీ కంటికి కనిపించే ప్రతిదీ AIకి తెలుస్తుంది.

 

India-USA : అమెరికా మార్కెట్‌పై భారత దండయాత్ర..!

ఈ టెక్నాలజీ వినడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇందులో కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే కెమెరా, మైక్రోఫోన్ వల్ల మన వ్యక్తిగత విషయాలకు భద్రత ఉంటుందా? గోప్యతను ప్రాణంగా భావించే యాపిల్ దీనిని ఎలా హ్యాండిల్ చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దశాబ్దాలుగా స్క్రీన్‌ చూస్తూ అలవాటు పడ్డ జనం, అకస్మాత్తుగా స్క్రీన్ లేని గాడ్జెట్‌ను అంగీకరిస్తారా?..బ్యాటరీ లైఫ్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఈ పరికరం ఎంతవరకు ఆధారపడుతుందనేది చూడాలి.

గతంలో గూగుల్ గ్లాస్ వంటి ప్రయోగాలు విఫలమయ్యాయి. కానీ యాపిల్ ఒక ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తెస్తోంది అంటే అది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మార్చేసేలా ఉంటుంది. ఒకవేళ ఈ AI పిన్ సక్సెస్ అయితే, మనం స్మార్ట్‌ఫోన్ల యుగం నుండి స్క్రీన్‌లెస్ యుగంలోకి అడుగుపెట్టినట్లే.ఇది ఐఫోన్ సృష్టించిన విప్లవాన్ని మళ్లీ రిపీట్ చేస్తుందా? లేక కేవలం ఒక ప్రయోగంగా మిగిలిపోతుందా? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News