Apple iPhone Pocket : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ మళ్లీ సర్ప్రైజ్ ఇచ్చింది! ఏంటి ఆ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? ఐఫోన్ 17 లేదా ఏఐ ఫీచర్లు కాదు, ఐఫోన్‌ను క్యారీ చేయడానికి స్పెషల్ పౌచ్ (iPhone Pocket) లాంచ్ చేసింది. జపాన్ డిజైనర్ ఇస్సే మియాకే (Issey Miyake)తో కలిసి తయారు చేసిన ఈ యాక్సెసరీ ధర అక్షరాలా రూ.19,500.
ALSO READ: Samantha: కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
యాపిల్ తాజాగా లాంఛ్ చేసిన ఐఫోన్ పౌచ్ ధర మన కరెన్సీలో రూ.20 వేలకు పైగా! నవంబర్ 14 నుంచి ఫ్రాన్స్, చైనా, ఇటలీ, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, UK, USలో అందుబాటులోకి వస్తుంది. హాంకాంగ్, టోక్యో, షాంఘై, పారిస్, సియోల్, సింగపూర్, మిలాన్, లండన్, న్యూయార్క్, తైపీలోని యాపిల్ స్టోర్‌లలో లభిస్తుంది. ఇక ఈ ప్రొడెక్ట్ పై సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. “ఐఫోన్ కొనలేక పాకెట్ కొనేది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లే!” అంటూ యూజర్లు ట్వీట్ చేస్తున్నారు.
ఐఫోన్ పాకెట్ ఫీచర్లు
ఈ పౌచ్ 3D-నిట్‌టెడ్ ఫాబ్రిక్‌తో తయారు చేశారు. ఒకే చీలికతో స్ట్రెచ్ అవుతుంది. ఐఫోన్ మోడల్స్ (15, 16 సిరీస్)కి సరిపోతుంది. షార్ట్ స్ట్రాప్ (వ్రిస్ట్ వేర్), లాంగ్ స్ట్రాప్ (క్రాస్‌బాడీ) ఆప్షన్లు. కలర్స్ – లెమన్, మ్యాండరిన్, పర్పుల్, పింక్, పీకాక్, సాఫైర్, సినమన్, బ్లాక్. ఇస్సే మియాకే ‘ప్లిటెడ్’ డిజైన్ ఇన్‌స్పిరేషన్ తో వచ్చేసింది. ఐఫోన్, ఎయిర్‌పాడ్స్, చిన్న ఐటమ్స్ (కీస్, కార్డ్‌లు) పెట్టుకోవచ్చు. డ్యూరబుల్, వాటర్-రెసిస్టెంట్. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైనర్ VP మోలీ ఆండర్సన్, “ఇది సింపుల్, క్రియేటివ్ యాక్సెసరీ. మా ఐఫోన్ కలర్స్‌కి మ్యాచ్ అవుతుంది” అని తెలిపారు.
ఇది యాపిల్ తయారు చేసిన తొలి పౌచ్ కాదు. 2004లో iPod Socks లాంచ్ చేసింది. స్టీవ్ జాబ్స్ పరిచయం చేసినది. ఇప్పుడు ఇందులో లగ్జరీ వెర్షన్ వచ్చేసింది. ఇక ఈ పౌచ్ ను నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. “ఐఫోన్ కొనలేక పాకెట్ కొంటున్నాం!” “iPod Socks తిరిగి వచ్చాయి, ధర 8 రెట్లు పెరిగింది”, “ఐఫోన్ పాకెట్ క్లాసిక్” అని ప్యారడీలు వినిపిస్తున్నాయి. యూట్యూబర్‌లు “లిట్మస్ టెస్ట్ ఫర్ అపిల్ ఫ్యాన్స్” అని వీడియోలు తీస్తున్నారు. జపాన్, USలో ప్రీ-ఆర్డర్ స్టార్ట్ అయింది. ఇండియాలో డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.


