Wednesday, November 12, 2025
Homeబిజినెస్Today Bank Holiday: ఈ రోజు బ్యాంకులకు సెలవా..? రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం..

Today Bank Holiday: ఈ రోజు బ్యాంకులకు సెలవా..? రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం..

October Bank Holidays: అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు వివిధ రోజుల్లో సెలవులో ఉంటాయి. ఈ నెల ఎక్కువగా పండుగలు ఉండటంతో దసరా, దుర్గాపూజ, దీపావళి, లక్ష్మి పూజ, ఛఠ్ పూజ, భాయ్ దూజ్ సహా ఇతర పెద్ద పండుగల కారణంగా బ్యాంకులు క్లోజ్ అయ్యి ఉండే రోజులు ఎక్కువే. అలాగే ప్రతి నెలలో రెండవ, నాల్గవ శనివారాలు కూడా బ్యాంక్ సెలవులుగా ఉండడం వల్ల, అక్టోబర్ నెలలో మొత్తం 21 రోజులు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవుల్లో ఉండనున్నాయి.

- Advertisement -

13 అక్టోబర్‌న అహోయ్ వ్రత కారణంగా బ్యాంక్ సెలవు ఉందా..?
ఆర్బీఐ సెలవుల జాబితాలో 13 అక్టోబర్ 2025 (సోమవారం) అహోయ్ వ్రత కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయా అనే అంశంపై క్లారిటీ చూస్తే డైరెక్ట్ సెలవు లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుగలకు అనుగుణంగా బ్యాంక్ బ్రాంచెస్ సెలవులో ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ అంటే 13 అక్టోబర్ న బ్యాంకులు చాలా చోట్ల పనిచేస్తాయని తెలుస్తోంది.

రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరులో బ్యాంక్ హాలిడేస్ పూర్తి లిస్ట్..
* 1 అక్టోబర్: మహా నవమి, దసరా, విజయదశమి (కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే)
* 2 అక్టోబర్: గాంధీ జయంతి – దేశవ్యాప్తంగా
* 6 అక్టోబర్: లక్ష్మీ పూజ (కేవలం కొద్ది రాష్ట్రాల్లో)
* 7 అక్టోబర్: మహర్షి వాల్‌మికి జయంతి/ కుమార్ పూర్ణిమా (కొన్ని రాష్ట్రాల్లో)
* 10 అక్టోబర్: కర్వ చౌత్ (షిమ్లాలో మాత్రమే)
* 11 అక్టోబర్: రెండవ శనివారం- దేశవ్యాప్తంగా
* 12 అక్టోబర్: ఆదివారం- దేశవ్యాప్తంగా
* 20, 21, 22, 23 అక్టోబర్: దీపావళి, బలి ప్రతిపద, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి పండుగలు-రాష్ట్రాలు, పట్టణాల వారీగా సెలవులు మారుతూ ఉంటాయి.​
* 25 అక్టోబర్: నాల్గవ శనివారం
* 27, 28 అక్టోబర్: ఛఠ్ పూజ
* 31 అక్టోబర్: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి (హైదరాబాదు, అహ్మదాబాద్ వంటి కొన్ని నగరాల్లో)

వాస్తవానికి రిజర్వు బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో అక్కడి ఆచారాలు, అలవాట్లకు అనుగుణంగా ఈ సెలవులను డిజైన్ చేస్తుంటుంది. అందువల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఒకేసారి సెలవు రావటం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, ఏటీఎం సేవలు, నెట్ బ్యాంకింగ్ ఈ సమయంలో అందుబాటులోనే ఉంటాయి. కేవలం బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పని ఉన్నప్పుడు మాత్రం సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad