Audi Q3 and Q5 Signature Line Launched: ఇండియాలో లగ్జరీ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. చాలామంది సాధారణ కార్లతో పాటు లగ్జరీ కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడి ఈ విభాగంలో అనేక కార్లను అందిస్తుంది. ఆడి ప్రత్యేకంగా దాని ప్రీమియం డిజైన్, అద్భుతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. కంపెనీ తన రెండు ప్రసిద్ధ ఎస్‌యూవీ మోడళ్లైన ఆడి Q3, ఆడి Q5 లను సిగ్నేచర్ లైన్ ఎడిషన్లను విడుదల చేసింది. ఆడి ఈ కొత్త ఎడిషన్‌లో మెరుగైన ఫీచర్లు, అద్భుతమైన ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లను అందించింది. ఇవి రెండు ఎస్‌యూవీలను మునుపటి కంటే మరింత విలాసవంతమైనవి, స్పోర్టిగా చేస్తాయి.
ఎడిషన్, ఫీచర్లు
భారతదేశంలో ఆడి ఎస్‌యూవీ లైనప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆడి Q3, Q3 స్పోర్ట్‌బ్యాక్, Q5 సిగ్నేచర్ లైన్ ఎడిషన్లను విడుదల చేసింది. ఈ మోడళ్లు లగ్జరీ, గొప్ప పనితీరును అందిస్తాయి. కొత్త ఎడిషన్‌లలో ఇప్పుడు LED డోర్ ప్రొజెక్షన్ ల్యాంప్‌లు, ప్రత్యేక ఆడి రిమ్ డెకల్స్, కొత్త వీల్ హబ్ క్యాప్స్, మెటల్ కీ ఫినిష్ మరియు స్టెయిన్‌లెస్-స్టీల్ పెడల్ కవర్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ కార్లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్నాయి.
ఆడి ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు చేసింది. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సువాసన డిస్పెన్సర్ వంటి లగ్జరీ అంశాలు జోడించింది. ఇక Q3, Q3 స్పోర్ట్‌బ్యాక్ ఇప్పుడు పార్క్ అసిస్ట్ ప్లస్, 12V అవుట్‌లెట్, USB పోర్ట్‌లు వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. Q3లో స్పోర్టీ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే Q5లో బిగ్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
స్టైలిష్ ఇంటీరియర్, కొత్త కలర్ ఆప్షన్లు
సిగ్నేచర్ లైన్ ఎడిషన్‌ను మరింత మెరుగుపరచడానికి ఆడి అనేక కొత్త కలర్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌లు నవారా బ్లూ, గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, మాన్‌హట్టన్ గ్రే, డిస్ట్రిక్ట్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. లోపల, కంపెనీ లగ్జరీ టచ్ మెటీరియల్స్, అప్డేట్ అయినా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సాఫ్ట్-టచ్ సర్ఫేస్‌లను కలిగి ఉంది. ఇది ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
ధర, వేరియంట్లు
కంపెనీ కొత్త ఎడిషన్‌ల ధరలను కూడా విడుదల చేసింది. ఆడి Q3 సిగ్నేచర్ లైన్ ధర రూ.52.31 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా, Q3 స్పోర్ట్‌బ్యాక్ సిగ్నేచర్ లైన్ ధర రూ.53.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా, ఇక Q5 సిగ్నేచర్ లైన్ ధర రూ.69.86 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.


