Saturday, November 15, 2025
HomeTop StoriesBajaj Finance : బజాజ్ ఫైనాన్స్ పంట పండింది ..ఏకంగా 27% గ్రోత్

Bajaj Finance : బజాజ్ ఫైనాన్స్ పంట పండింది ..ఏకంగా 27% గ్రోత్

Loan: భారతీయ వినియోగదారుల కొనుగోలు శక్తి అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన నెక్స్ట్ జనరేషన్ GST సంస్కరణలు, ఆదాయపు పన్ను మార్పులే అని తేలింది. ఈ సానుకూల ప్రభావం వల్లే ఈ పండుగ సీజన్‌లో వినియోగదారుల రుణాల పంపిణీలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది.

- Advertisement -

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ నాన్-బ్యాంకింగ్ రుణదాత అయిన బజాజ్ ఫైనాన్స్, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, లోన్ వాల్యూమ్‌లో ఏకంగా 27% పెరుగుదలను ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 26, 2025 వరకు కంపెనీ సుమారు 63 లక్షల రుణాలను పంపిణీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ పండుగ సీజన్ వృద్ధి కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఆర్థిక చేరికలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది.

23 లక్షల కొత్త కస్టమర్లు: ఈ కాలంలో బజాజ్ ఫైనాన్స్‌కు కొత్తగా చేరిన కస్టమర్లలో 52% మంది తొలిసారిగా అధికారిక ఆర్థిక వ్యవస్థ నుండి రుణాలు తీసుకున్నవారు ఉన్నారు. వీరు కొత్తగా క్రెడిట్ పొందినవారు కావడం దేశ ఆర్థిక వృద్ధికి శుభ సంకేతం.

సంజీవ్ బజాజ్ వ్యాఖ్యలు: మా కొత్త కస్టమర్లలో సగానికి పైగా మొదటిసారి రుణం తీసుకున్నవారు ఉన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, 4,200 ప్రదేశాలలో మా ఉనికితో, మేము ఆర్థిక చేరికను మరింతగా పెంచుతున్నామని బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు.పండుగ రుణాల పెరుగుదలకు ప్రధాన కారణం వినియోగ వస్తువుల ధరలు తగ్గడం ,వినియోగదారుల జీవనశైలి మెరుగుపడటమే.

GST ప్రభావం: టీవీలు, ఎయిర్ కండిషనర్లపై GST తగ్గించడం వలన వినియోగదారుల సగటు టికెట్ పరిమాణం 6% తగ్గింది. ఇది వారికి అధిక-నాణ్యత (Premium) ఉత్పత్తులకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని కల్పించింది.

పెద్ద స్క్రీన్లకు డిమాండ్: 40-అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్ ఉన్న టీవీల కోసం ఫైనాన్సింగ్ గతేడాది 67% ఉండగా, ఈ ఏడాది ఏకంగా 71% వాటాను కలిగి ఉంది. అంటే, భారతీయ మధ్యతరగతి ఇక చిన్న వస్తువులకే పరిమితం కావడం లేదని స్పష్టమవుతోంది.

ప్రభుత్వ సంస్కరణల ద్వారా మధ్య , తక్కువ ఆదాయ కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగిందని, తద్వారా పండుగ సీజన్‌లో వారు మరింత నమ్మకంగా ఖర్చు చేయగలుగుతున్నారని సంజీవ్ బజాజ్ ధీమా వ్యక్తం చేశారు. ‘GST బచత్ ఉత్సవ్’ పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన ఈ సంస్కరణలు 2017లో GST ప్రవేశపెట్టినప్పటి నుండి అతిపెద్ద చర్యల్లో ఒకటిగా నిలిచింది.

మొత్తం మీద, బజాజ్ ఫైనాన్స్ విజయం భారతీయ వినియోగ వృద్ధి కథకు, ఆర్థిక సంస్కరణల సానుకూల ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad