Cheapest Bajaj Chetak EV: బజాజ్ ఆటో తన ఐకానిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. మధ్యతరగతి వాహనదారులను, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఈవీ (EV) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ‘బజాజ్ చేతక్ C25’ (Bajaj Chetak C25) మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 91,399 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ స్కూటర్, చేతక్ సిరీస్‌లోనే అత్యంత సరసమైన వేరియంట్‌గా నిలిచింది.
ఫీచర్లు ..
బడ్జెట్ ధరలో వచ్చినప్పటికీ, చేతక్ C25 నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గలేదు. దీని ముఖ్యమైన ఫీచర్లు చూస్తే.. ఇందులో 2.5kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది (IDC రేంజ్). సిటీ ప్రయాణాలకు అనుగుణంగా దీని గరిష్ట వేగాన్ని గంటకు 55 కిలోమీటర్లుగా నిర్ణయించారు. 750W ఛార్జర్ సహాయంతో కేవలం 3 గంటల 45 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిస్థాయిలో నింపవచ్చు.
Also Read:Maruti Suzuki. – మారుతీ సుజుకీ బంపరాఫర్..
డిజైన్ , స్మార్ట్ టెక్నాలజీ
చేతక్ తన క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే ఆధునిక హంగులను అద్దుకుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, హ్యాండిల్‌బార్‌లోనే టర్న్ ఇండికేటర్లు దీనికి రెట్రో-మోడ్రన్ లుక్‌ని ఇస్తాయి. గ్రీన్, వైట్, బ్లాక్, గ్రే, రెడ్ మరియు ఎల్లో వంటి 6 ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. ఇందులో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్/SMS నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి స్మార్ట్ ఫీచర్లను పొందవచ్చు. సీటు కింద 25 లీటర్ల విశాలమైన స్టోరేజ్, USB ఛార్జింగ్ పోర్ట్, మరియు పార్కింగ్ సమయంలో ఇబ్బంది లేకుండా ‘రివర్స్ అసిస్ట్’ ఫీచర్లను అందించారు.
మార్కెట్ పోటీ
ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది. బజాజ్ చేతక్ C25 నేరుగా ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), హీరో విడా (Vida VX2) మరియు టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter) వంటి మోడళ్లతో తలపడనుంది. తక్కువ ధరలో నమ్మకమైన బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ప్రస్తుతం ఈ స్కూటర్ బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో మరియు దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి.

