Ban on silver imports: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దిగుమతుల ఖర్చును తగ్గించుకోవడానికి, విలువైన లోహాల వ్యాపారంపై పర్యవేక్షణను పెంచడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం, ఒక లైసెన్స్ మీద పన్ను లేకుండా గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా, మొదటిసారి ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారి తయారీ కేంద్రాలను అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు జారీ చేస్తారు. గతంలో లైసెన్స్ పొంది మళ్లీ దరఖాస్తు చేసుకునే వారి విషయంలోనూ కఠినంగా వ్యవహరించనున్నారు. వారి కోసం ప్రత్యేక నియమ నిబంధనలు పొందుపర్చారు. పాత లైసెన్స్ కింద తాము చేయాల్సిన ఎగుమతుల్లో కనీసం 50 శాతాన్ని పూర్తి చేస్తేనే వారికి కొత్తగా అనుమతులిస్తారు.
Also read: Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ ప్రభుత్వ వైఫల్యమే.. విద్యామంత్రిని తొలగించాలని రాహుల్ డిమాండ్
వారి కోసం ప్రత్యేక నియమ నిబంధనలు..
పన్ను లేకుండా బంగారాన్ని దిగుమతి చేసుకునే వ్యాపారులు ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి తమ వ్యాపార లావాదేవీల వివరాలను చార్టర్డ్ అకౌంటెంట్ చేత ధృవీకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ప్రాంతీయ అధికారులు ప్రతి నెలా నివేదిక రూపంలో డీజీఎఫ్‌టీ ప్రధాన కార్యాలయానికి పంపుతారు. అక్కడ కేంద్ర అధికారులు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తారు.

