Bank Holidays: దేశవ్యాప్తంగా బ్యాంక్ కస్టమర్లకు కీలకమైన అప్‌డేట్ ఇది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 18, 19, 20తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంక్ బ్రాంచ్‌లు పూర్తిగా మూసి ఉంటాయి. ఇది జాతీయ స్థాయి సెలవు కాదు… ప్రాంతాల వారీగా అమలయ్యే హాలిడే కావడంతో ప్రతి రాష్ట్రంలో ఒకేలా ఉండదు. ముఖ్యంగా ఆ మూడు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో బ్రాంచ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు ముందే తెలుసుకోవాల్సిన విషయం ఇది.
ఫిబ్రవరి 18న సిక్కిం (Sikkim) రాష్ట్రంలో లోసార్ అంటే టిబెటన్ న్యూ ఇయర్ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఫిబ్రవరి 19న మహారాష్ట్ర (Maharashtra)లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లు మూసేస్తారు. ఇక ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) అలాగే మిజోరం (Mizoram) రాష్ట్రాల్లో స్టేట్ డే స్టేట్‌హుడ్ డే కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే ఈ మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు.
అయితే ఇక్కడ ఒక రిలీఫ్ ఏమిటంటే… బ్రాంచ్‌లు మూసినా ఏటీఎం సేవలు, యూపీఐ లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రం నార్మల్‌గా పనిచేస్తాయి. డబ్బు విత్‌డ్రా చేయడం, ఫోన్ ద్వారా పేమెంట్స్ చేయడం, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ లాంటివి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. ఫిబ్రవరి 21 రెండో శనివారం కాదు నాలుగో శనివారం కూడా కాదు కాబట్టి ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్‌గా ఉంటాయి. అయినా సరే మీ దగ్గరున్న బ్రాంచ్ టైమింగ్స్ కొంచెం మారే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్లే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెస్ట్.
ఆర్‌బీఐ ఈ సెలవులన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం ప్రకటిస్తుంది. ఇందులో ప్రాంతీయ పబ్లిక్ హాలిడేలు, ఆర్‌టీజీఎస్ సెలవులు, అకౌంట్ క్లోజింగ్ డేస్ కూడా ఉంటాయి. ఫిబ్రవరి తర్వాత మార్చి నెలలో అయితే దాదాపు 11 బ్యాంక్ హాలిడేలు ఉండబోతున్నాయి. హోలీ, రంజాన్, రామ నవమి, మహావీర్ జయంతి లాంటి పండుగల కారణంగా చాలా రోజుల పాటు బ్యాంక్ సేవలు బ్రాంచ్ స్థాయిలో నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన చెక్ డిపాజిట్‌లు, క్యాష్ లావాదేవీలు, డాక్యుమెంట్ పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఈ చిన్న జాగ్రత్త మీ సమయాన్ని సేవ్ చేస్తుంది… అనవసరంగా బ్యాంక్ ముందు నిలబడే పరిస్థితి రాకుండా చేస్తుంది.

