Bank Holidays in November Plan according to this List: అక్టోబర్ నెల దాదాపు ముగింపునకు వచ్చింది. నవంబర్ ప్రారంభం కానుంది. నవంబర్ నెలలో అనేక మార్పులతో పాటు బ్యాంకులకు అనేక సెలవులు రానున్నాయి. వీటిలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు రానున్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతాయని గమనించాలి. మరోవైపు, ఈ సెలవు దినాల్లో డిజిటల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి. మీరు బ్యాంకు పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకు ఏ ఏ రోజుల్లో పని దినాలను కలిగి ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాలి. నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
నవంబర్ 1 (శనివారం): కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా బెంగళూరులో, ఇగాస్-బాగ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు అమల్లో ఉంటుంది.
నవంబర్ 2 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
నవంబర్ 5 (బుధవారం):గురునానక్ జయంతి, కార్తీక పౌర్నమి సందర్భంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 7 (శుక్రవారం): వంగలా పండుగ సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
నవంబర్ 8 (శనివారం): రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు అమల్లో ఉంటుంది. కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులు మూసివేయబడతాయి.
నవంబర్ 9, 16, 23, 30 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు అమల్లో ఉంటుంది.
నవంబర్ 22 (శనివారం): నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం..
ఈ లిస్టు ప్రకారం, నవంబర్‌లో 9 నుండి 10 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల, మీరు చెక్కులను డిపాజిట్ చేయాలనుకున్నా.. పాస్‌బుక్‌ను అప్డేట్ చేయాలనుకున్నా.. మనీ విత్‌డ్రా, మనీ డిపాజిట్ చేయాలనుకున్నా, లోన్ పొందాలనుకున్నా సంబంధిత పనులను బ్యాంకు పని దినాలలో మాత్రమే ప్లాన్ చేసుకోవాలని బ్యాంకులు చెబుతున్నాయి. సెలవు దినాలలో ఈ సేవలు అందుబాటులో ఉండవని గుర్తు చేస్తున్నాయి. అయితే, 24/7 పనిచేసే డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ఏటీఎం సేవలను మాత్రం యథావిధిగా ఉపయోగించవచ్చు. కాగా, బ్యాంకు అకౌంట్ల నామినీ అంశంపై కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం, ఇప్పటి వరకు ఖాతాదారుడికి నామినీగా ఒకరిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉండేది. అయితే నవంబర్ 1 నుంచి ఒక బ్యాంకు ఖాతాదారుడు నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. నామినీలకు సంబంధించి బ్యాంకింగ్ చట్టంలో తెచ్చిన సవరణలు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది.


