Bank Holidays in October: అక్టోబర్‌లో మీకు బ్యాంకులో పని ఉందా? అయితే, మీకో బిగ్ షాక్. వరుస పండుగల నేపథ్యంలో వచ్చే నెల ఏకంగా 20 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆయా రాష్ట్రాల వారీగా బ్యాంకుల హాలిడేస్ లిస్ట్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. ఏ ఏ రోజుల్లో బ్యాంకు సెలవులు ఉండనున్నాయో తెలుసుకుందాం.
అక్టోబర్‌లో బ్యాంకు హాలిడేస్ లిస్ట్..
అక్టోబరు 1: నవరాత్రి ముగింపు, మహా నవమి, దసరా, విజయదశమి/దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇటానగర్, కాన్పూర్, కొచ్చి, కొహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలో బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, దసరా, విజయదశమి, దుర్గా పూజ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 3: దుర్గా పూజ కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 6: లక్ష్మీ పూజ కారణంగా అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 10: కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 18: కటి బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 20: దీపావళి, నరక్ చతుర్దశి, కాళి పూజ కారణంగా అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ, లక్నో, చెన్నై సహా 25 ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 21: దీపావళి అమావాస్య, గోవర్ధన్ పూజ కారణంగా బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసింటాయి.
అక్టోబర్ 22: దీపావళి, విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం, బలిపాడమి, లక్ష్మీ పూజ కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నాలలో బ్యాంకులకు సెలవు.
అక్టోబరు 23: అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలోని బ్యాంకులు భాయ్ దూజ్, భత్రి ద్వితీయ, చిత్రగుప్త జయంతి, లక్ష్మీ పూజల కారణంగా మూసి ఉంటాయి.
అక్టోబర్ 27, 28: ఛఠ్ పూజ కారణంగా పాట్నా, కోల్‌కతా, రాంచీ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజున అహ్మదాబాద్‌లోని బ్యాంకులు మూతపడ్డాయి.
వారాంతపు సెలవులు: దేశవ్యాప్తంగా బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శనివారాలు అనగా అక్టోబర్ 11, 25, ప్రతి ఆదివారం అనగా అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో మూసి ఉంటాయి. ఈ పండుగ, సెలవుల రోజులను దృష్టిలో కస్టమర్లు తమ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని ఆర్‌బీఐ కోరింది.


