Homeబిజినెస్Bank Locker : బ్యాంక్ లాకర్.. మీరు అనుకుంటున్నంత సురక్షితమేనా?

Bank Locker : బ్యాంక్ లాకర్.. మీరు అనుకుంటున్నంత సురక్షితమేనా?

Jewelry Insurance: మన ఇంట్లో శుభకార్యాలప్పుడు వేసుకునే నగలను, పత్రాలను లాకర్‌లో పెట్టి తాళం వేయగానే.. “ఇక అంతా సేఫ్” అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ, ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. లాకర్ అనేది కేవలం అద్దెకు తీసుకున్న ఒక ఖాళీ డబ్బా మాత్రమే. లోపల ఉన్న వస్తువుల విలువతో బ్యాంకుకు సంబంధం లేదు.

Gold Rate: ధనవంతులు కూడా కొనలేని స్థాయిలకు గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లు ఇవే..

- Advertisement -

 

మీకు వచ్చేది ఎంత?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. దొంగతనం, అగ్నిప్రమాదం, భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగి మోసం వల్ల మీ నగలు పోతే బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది. కానీ, అది మీ వార్షిక లాకర్ అద్దెకు కేవలం 100 రెట్లు మాత్రమే. మీరు మీ లాకర్ కోసం ఏడాదికి ₹2,000 అద్దె కడుతున్నారనుకోండి. దొంగతనం జరిగినప్పుడు మీ లాకర్‌లో 10 తులాల బంగారం ఉన్నా, 100 తులాల బంగారం ఉన్నా.. బ్యాంకు మీకు ఇచ్చే గరిష్ట పరిహారం కేవలం ₹2,00,000 (రెండు లక్షలు) మాత్రమే. ఈ రోజుల్లో రెండు లక్షలకు కనీసం రెండు గాజులు కూడా రావన్నది చేదు నిజం.

బ్యాంక్ బాధ్యత సున్నా
ఒకవేళ వరదలు వచ్చినా, భూకంపం సంభవించినా లేదా పిడుగులు పడి లాకర్‌లోని వస్తువులకు నష్టం వాటిల్లినా.. బ్యాంకు మీకు ఒక్క రూపాయి కూడా చెల్లించదు. “ఇది మా చేతుల్లో లేని పని (Act of God)” అని బ్యాంకులు చేతులెత్తేస్తాయి. అంటే అక్కడ రిస్క్ అంతా మీదే.

బీమా ఎందుకు ఉండదు?
బ్యాంకు వారు లోపల ఉన్న వస్తువులకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయరు? అనే ప్రశ్న మనకు రావచ్చు. దానికి కారణం.. లాకర్ లోపల మీరు ఏం పెట్టారో బ్యాంకుకు తెలియదు. మీరు బంగారం పెట్టారా, వెండి పెట్టారా లేదా కేవలం పత్రాలు పెట్టారా అనేది రహస్యం. అందుకే లోపల ఉన్న వస్తువులకు బీమా కల్పించే అధికారం బ్యాంకులకు లేదు.

జాగ్రత్తలు ఇవే
కేవలం లాకర్ నమ్ముకుని కూర్చోకుండా, ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.లాకర్‌లో ఉన్నా సరే, మీ బంగారానికి విడిగా బీమా చేయించుకోవడం అన్నిటికంటే సురక్షితం. మీ నగలకు సంబంధించిన ఫోటోలు, తూకం వివరాలు, రశీదులను భద్రపరుచుకోండి. లాకర్ తీసుకునేటప్పుడు సంతకం చేసే పేపర్లను క్షుణ్ణంగా చదవండి. అందులో బ్యాంక్ బాధ్యత ఎంత ఉందో స్పష్టంగా ఉంటుంది.

బ్యాంక్ లాకర్ అంటే భద్రతకు కేవలం ఒక మెట్టు మాత్రమే, అది పూర్తి భరోసా కాదు. ఈ నిజాన్ని తెలుసుకుని ముందే జాగ్రత్త పడటం ప్రతి ఒక్కరి బాధ్యత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News